Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్

Edited By:

Updated on: Dec 22, 2025 | 5:46 PM

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ సైలెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తారక్ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడు. 20 రోజుల నైట్ షూట్‌లో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. 2026 జూన్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా సైలెంట్‌గా జరుగుతుంది.. అసలు ఏం మాత్రం సందడే లేదు. అప్‌డేట్స్ లేవు.. ట్రెండింగ్‌లో లేదు. అసలేంటి సంగతి..? తారక్ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది..? ప్రజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతంది..? ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ ఎన్ని రోజులు..? ఇవన్నీ చూద్దాం పదండి.. వార్ 2తో దాదాపు పదేళ్ళ తర్వాత ఎన్టీఆర్‌కి ఫ్లాప్ వచ్చింది.. అయితే అది మన సినిమా కాదని సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. తారక్ కూడా ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా RFCలో జరుగుతుంది. ఇప్పటికే లేట్ అవ్వడంతో.. నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు నీల్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాద్షా తర్వాత ఇందులో మరోసారి మాఫియా డాన్‌గా తారక్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు ఈ హీరో. మామూలుగా తన హీరోలను లావుగా చూపించే నీల్.. ఈ సారి తారక్‌ను మాత్రం మరీ సన్నగా కరెంట్ తీగలా మార్చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 20 రోజుల పాటు నైట్ షూట్ జరగనుంది. ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు నీల్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అయ్యేది ఈ సీక్వెన్సులే అని తెలుస్తుంది. ప్రత్యేకించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా ప్రిపేర్ అయ్యారు తారక్. దాంతో పాటు ఫారెన్ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. 20 రోజుల షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్లే. ఆ తర్వాత పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది.. దాంతో పాటు కొన్ని సీక్వెన్సులున్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2026 జూన్ 25న చెప్పిన తేదీకే సినిమా విడుదల చేస్తామంటున్నారు ప్రశాంత్ నీల్. యూనివర్స్‌లో భాగం కాకుండా.. స్టాండ్ అలోన్ సినిమాగానే దీన్ని రూపొందిస్తున్నారు నీల్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే

అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత

అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ

చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్‌

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..