Nithiin: జానర్ మార్చిన నితిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా

Edited By:

Updated on: Jan 27, 2026 | 6:50 PM

నితిన్ కెరీర్‌లో విజయాల కోసం పడుతున్న పాట్లు, ఆయన ఎదుర్కొంటున్న ఫ్లాపుల పరంపరపై ఈ కథనం. కొత్తగా వీఐ ఆనంద్‌తో కలిసి సైన్స్ ఫిక్షన్ కథాంశంతో 'నో బాడీ.. నో రూల్స్' చిత్రాన్ని ప్రకటించారు. ఈ ప్రయోగం ఆయనకు విజయాన్ని అందిస్తుందా? రొటీన్‌కు దూరంగా ఉండి, కథ ఎంపికలో దమ్ము చూపితేనే సక్సెస్ సాధ్యమని నెటిజన్లు ఇస్తున్న సలహాలను నితిన్ పాటిస్తున్నారా లేదా అనేది చూడాలి.

కొంత మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారా? లేరా? అనే అనుమానం కలుగుతుంటుంది జనాలకు. వాళ్లు చూడ్డానికి ఫిట్‌గా ఉంటారు. చేసేవన్నీ మంచి బడ్జెట్‌ సినిమాలే. అయినా ఎక్కడో ఇబ్బంది. హిట్‌ అనే పదం వారి చెవిన పడి ఏళ్లకు ఏళ్లు అవుతున్నాయి. అలాంటివారిలోనే ఉన్నారు నితిన్‌. చేస్తున్న సినిమాలన్నీ అస్సాం పోతున్నా… పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు నితిన్‌. అసలు నితిన్‌కి ఏమైంది? నిన్న మొన్నా కొత్తగా వచ్చిన వాళ్లే ఖతర్నాక్‌ సబ్జెక్టులు సెలక్ట్ చేసుకుని హిట్‌ సౌండ్‌ వింటున్నారు. అలాంటిది ఇన్నేళ్ల ఎక్స్ పీరియన్స్ నితిన్‌కి వర్కవుట్‌ కావడం లేదా? జాగ్రత్తగా అన్నీ ప్లాన్‌ చేసుకున్నా… ఆయన్ని నమ్మి జనాలు థియేటర్ల దాకా నడవడం లేదా? విషయం ఏదైనా ఈ స్టార్‌ సక్సెస్‌ చూసి చాలా ఏళ్లయింది. సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయని సైలెంట్‌గా కూర్చోవడం లేదు నితిన్‌. ఎప్పటికప్పుడు ఎనర్జీని కూడగట్టుకుని కొత్త ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నో బాడీ.. నో రూల్స్ అంటూ ఓ నయా అనౌన్స్ మెంట్‌ ఇచ్చేశారు. సైన్స్ ఫిక్షన్‌ కథతో వీఐ ఆనంద్‌ డైరక్షన్‌లో ప్రయోగం చేయబోతున్నారనే విషయం అర్థమవుతూనే ఉంది. మరి ఈ సారైనా నితిన్‌కి ఈ ప్రయోగం కలిసొస్తుందా? జోనర్లు మార్చినంత మాత్రాన సక్సెస్‌ రావాలనేం లేదు. సెలక్ట్ చేసుకున్న స్టోరీలో దమ్ముండాలని సలహాలిస్తున్నారు నెటిజన్లు. రొటీన్‌ రొడ్డ కొట్టుడు సినిమాలకు కాసింత కామా పెట్టేసి, కొత్తగా ట్రై చేస్తే తప్పక జనాలను అట్రాక్ట్ చేసుకోవచ్చన్నది వారి నుంచి అందుతున్న మరో సలహా. ఇంతకీ నితిన్‌ ఈ మాటలను వింటున్నట్టేనా?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నయన్‌కి హిట్‌ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి

Kethireddy Venkatarami Reddy: వైసీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయి

Gold and Silver: జెట్ స్పీడుతో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు

అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం

లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !! ఆమెతోనే కలిసి వచ్చి..మాయమైన కిలాడీ దొంగ