News Watch: దివికేగిన సినీ స్వాతిముత్యం..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్గదర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్.. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు. ఎన్నో చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు.
కమల్ హాసన్ తో కె.విశ్వనాథ్ తీసినా స్వాతిముత్యం.. ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. 1986లో జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగులో స్వాతిముత్యం అవార్డు పొందింది.1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రంగా సప్తపది, 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు సాగరసంగమం అవార్డులు సొంతం చేసుకున్నాయి. ‘స్వయంకృషి’, ‘స్వర్ణ కమలం’ ‘ఆపద్భాందవుడు’ ‘స్వాతి కిరణం’, ‘శుభప్రదం’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించి ప్రేక్షకుల మెప్పును పొందారు. అలాగే 1988 లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగులో శృతిలయలు, 2004 లో జాతీయ ఉత్తమ చలనచిత్రం- తెలుగు స్వరాభిషేకం సినిమాలకు పురష్కారాలు లభించాయి. ‘సిరి వెన్నెల’ చిత్రంలో గుడ్డివాడిగా సర్వదమన్ బెనర్జీ , మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఇప్పటికీ మరచిపోలేయా చిత్రికరించారు విశ్వనాథ్. ఈ సినిమాతో పాటల రచయత సీతారామశాస్త్రి ఇంటి పేరు ‘సిరివెన్నెల‘ గా మారిపోయింది. అనేక సామాజిక కథాంశాలతో వరకట్న సమస్యపై ‘శుభలేఖ’, కులవ్యవస్థపై ‘సప్తపది’, గంగిరెద్దు వాళ్ల జీవితం ఆధారంగా ‘సూత్రధారులు’, బద్దకస్తుడి కథ ఆధారంగా ‘శుభోదయం’ చిత్రాలు ఆయనలోని సంఘ సంస్కర్తను మేలుకొలిపాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..