Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్

భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్

Phani CH
|

Updated on: Jun 17, 2025 | 1:52 PM

Share

కొత్త వింత, పాత రోత.. అనే సామెత ఉంది. అయితే ఈ సామెతే ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ విషయంలో నిజమైంది. ఎందుకంటే తాను దీర్ఘ సుమంగళిగా ఉండాలని.. సావిత్రి వ్రతాన్ని ఆచరించిన ఈ హీరోయిన్ ఆ వ్రతంలో భాగంగా తన భర్త కాళ్లు కడిగిన నీళ్లను తాగేసింది. ఇప్పుడీ ఈ వ్రతాచారంతో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఎలినా సమంతరాయ్! మన దగ్గర కాదు కానీ.. ఒడిశా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.

అభయ్‌ సినిమాతో అక్కడ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ బ్యూటీ… తన యాక్టింగ్‌ తో ఒడిశా స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డు అందుకుంది. అయితే కెరీర్ పీక్‌లో ఉండగానే.. పెళ్లికి రెడీ అయిపోయిన ఈ బ్యూటీ… 2024 నవంబర్‌లో అనురాగ్ పండా అనే వ్యక్తితో ఇండోనేసియాలోని బాలిలో గ్రాండ్‌గా తన పెళ్లి వేడుక చేసుకుంది. ఎట్ ప్రజెంట్ తన మ్యారేజ్‌ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ… రీసెంట్‌గా సావిత్రి వ్రతం చేసింది. అయితే ఈ వ్రతంలోనే భాగంగా…. తన భర్త పాదాలను కడిగింది. అంతటితో ఆగకుండా… తన భర్త కాళ్లు కడిగిన ఆ నీళ్లను ప్రసాదంగా భావించి తాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ కూడా చేసింది. దీంతో ఈ బ్యూటీ ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జమానాలో కూడా ఇలాంటి పని చేయడమేంటనే షాకింగ్ కామెంట్ తన ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే ట్రోల్‌ అవుతోంది ఎలినా..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో