Nayanthara: నయనతారకు .. విఘ్నేశ్ అదిరిపోయే గిఫ్ట్..
లేడీ సూపర్‌స్టార్ నయనతార 41వ పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ ఖరీదైన కానుకతో కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విఘ్నేష్ తన ప్రేమను వ్యక్తం చేస్తూ, ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వడం సంప్రదాయంగా మార్చుకున్నారు.
లేడీ సూపర్‌స్టార్ నయనతార నవంబరు 19న 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. సుమారు రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును గిఫ్ట్‌గా అందించారు. ఈ ఖరీదైన కారుతో కుటుంబ సమేతంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంతోషకరమైన క్షణాలను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ భావోద్వేగపూరితమైన క్యాప్షన్ రాశాడు. నా ప్రియమైన బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మాకు ఎప్పుడూ ఇలాంటి మధురమైన క్షణాలనే అందించాలి అని పేర్కొన్నాడు. విఘ్నేశ్ శివన్ తన భార్యకు లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా దీన్ని ఒక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. 2023లో రూ.3 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును, 2024లో రూ.5 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ జీఎల్‌ఎస్ 600ను బహుమతిగా ఇచ్చారు. ఈ ఏడాది అంతకుమించి ఖరీదైన రోల్స్ రాయిస్‌ను కానుకగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. ఇక నయన్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో పాటు, కన్నడ స్టార్ యశ్‌తోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ, మలయాళ భాషల్లోనూ ఆమె చేతిలో డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన పుట్టినరోజు వేడుకలను మాత్రం కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు నయనతార.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కసిగా లవర్ దగ్గరకు వెళ్ళాడు.. ప్రేమగా కొరికి చేతిలో పెట్టింది..
అయ్యో కొడుకా.. నా కడుపున ఎందుకు పుట్టావురా !! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
భద్రాచలం గుడిలో ప్రసాదం దందా.. అధికారులే సూత్రధారులు
Mars: అంగారకుడిపై వింత రాయి.. ఇది ఎక్కడి నుండి వచ్చింది ??
కూతురిని ఇంట్లో బంధించి.. నరకం చూపిన తల్లి.. అమ్మ ఇలా కూడా చేస్తుందా !!
