Nayanthara: సింహా జోడీకి సూపర్‌క్రేజ్‌.. మహారాణి వచ్చేస్తున్నారహో

Edited By:

Updated on: Nov 20, 2025 | 3:01 PM

నయనతార నందమూరి బాలకృష్ణతో నాలుగోసారి జోడీ కడుతూ మహారాణి పాత్రలో కనిపించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకులతో బంధం కొనసాగించాలని నయన్ నిర్ణయం తీసుకున్నారు. సింహా, జై సింహా, శ్రీరామరాజ్యం తర్వాత ఈ కాంబినేషన్‌కి భారీ క్రేజ్ ఉంది. సినిమా నవంబర్ 26న ప్రారంభం.

సముద్రమంత ప్రశాంతత, తుపాను అంత భీభత్సాన్ని తనలో మోసే మహారాణి పాత్రలో కనిపించనున్నారు నయన్‌. నందమూరి బాలకృష్ణతో నాలుగోసారి జోడీ కట్టనున్నారు లేడీ సూపర్‌స్టార్‌. ఈ నెల 26న స్టార్ట్ కానుందీ సినిమా. ఈ మూవీ మాత్రమే కాదు… తెలుగు ఆడియన్స్ తో సత్సంబంధాలు కంటిన్యూ చేయాలని ఫిక్సయ్యారు నయన్‌. నయనతార తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. ఆమె పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో ఇదొకటి. నందమూరి బాలకృష్ణతో నయన్‌ నటించిన సింహా, జై సింహా, శ్రీరామరాజ్యం సినిమాలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని మరోసారి స్క్రీన్‌ మీద విట్‌నెస్‌ చేయడానికి సిద్ధమయ్యారు గోపీచంద్‌ మలినేని. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే శక్తిమంతమైన ఈ యాక్షన్‌ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నట్టు సమాచారం. నవంబర్‌ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. సెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు గోపీచంద్‌ మలినేని. ప్రస్తుతం తెలుగులో మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో నటిస్తున్నారు నయన్‌. 2026 సంక్రాంతికి జనాలకు హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ అయినా.. ఇప్పుడున్న టాప్‌ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత బిజీగా ఉన్నారు నయన్‌. రెమ్యునరేషన్‌ పరంగా బాగా డిమాండ్‌ చేసినా, చాలా మంది హీరోలకు ఆన్‌ స్క్రీన్‌ పర్ఫెక్ట్ జోడీ అనిపించుకోవడంతో గ్రేస్‌ కంటిన్యూ అవుతోందని నయన్‌ సక్సెస్‌ని డీకోడ్‌ చేస్తున్నారు క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్ ఇండియా డైరెక్టర్లు.. పక్కా లోకల్‌ సినిమాలు చేసేదెప్పుడు

పాక్‌ ఉగ్ర కుట్రలు.. బిర్యానీ,దావత్ కోడ్ తో..

ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకెళ్లినకారు.. ఆ తర్వాత..

IPL 2026: ఐపీఎల్ 2026 వేలం ముహూర్తం ఫిక్స్..

అరె.. ముల్లు తీయడం ఇంత ఈజీనా.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక.. కష్టపడ్డానే