రూట్ మార్చిన నేచురల్ స్టార్.. మరో కొత్త అవతారం లో కనపడనున్న నాని
నాని ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మాస్ చిత్రాల తరువాత వైవిధ్యం కోరుకుంటున్న నాని, 96 దర్శకుడు ప్రేమ్ కుమార్‌తో సాఫ్ట్ రోల్‌లో సినిమా చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2027 తర్వాత ఉండవచ్చు.
నాని ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ, తన కెరీర్‌లో కొత్త దారిని తొక్కుతున్నారు. రగ్గడ్ లుక్‌లో ఇటీవల షేర్ చేసిన చిత్రంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ప్యారడైజ్ పనుల్లో నాని నిమగ్నమై ఉన్నారు. దసరా తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యారడైజ్ పూర్తికాగానే, నాని తన దృష్టిని సుజీత్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్టుపై కేంద్రీకరించనున్నారు. ఇది పూర్తైన తర్వాత, మాస్ సినిమాలతో విసిగిపోయిన నాని ఒక సాఫ్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. 96, మెయ్యళగన్ వంటి సెన్సిబుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్‌తో నాని సినిమా చేయబోతున్నారని కోలీవుడ్‌లో విస్తృతంగా వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బస్సుల్లోనూ బాత్రూంలు
పవన్‌కు కోమటిరెడ్డి కౌంటర్.. ముదురుతున్న వివాదం
TOP 9 ET News: అఖండ-2 లో సీనియర్ ఎన్టీఆర్ ??
Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కాస్ట్.. ఎన్ని కోట్లో తెలుసా ??