Natural star nani: సినిమాను థియేటర్ కోసమే దాచాల్సిన అవసరం నాకు లేదు.. నాని సంచలన వ్యాఖ్యలు..(వీడియో)
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు నాని. ఆ క్రమంలోనే ఈ సినిమాను వీలైనంత ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు ఈ క్రేజీ హీరో. అయితే
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు నాని. ఆ క్రమంలోనే ఈ సినిమాను వీలైనంత ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు ఈ క్రేజీ హీరో. అయితే రీసెంట్ ఇంటర్య్యూలో నాని చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం నాకు లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతానని నాకు తెలుసు” అని నాని అన్నారు. నిర్మాతలు హ్యాపీగా ఉండాలని.. సినిమా కోసం పని చేసినవారంతా సంతోషంగా ఉండాలని.. రెగ్యులర్‌గా పని చేస్తుండాలని నాని కోరుకున్నారు. ” అంతేకాని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు అని చెప్పుకొచ్చారు నాని.”శ్యామ్ సింగ రాయ్ పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై కమ్యూనిస్ట్ అయిన శ్యామ్ ప్రేమలో పడితే.. అతను ఎలా మారుతాడు అనేది సినిమా. శ్యామ్ సింగ రాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం.” అని సినిమా గురించి చెప్పారు నాని.