‘మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు..ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్..:Deepthi ganta as director video.
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అటూ హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన అ, hit వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు .....
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అటూ హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన అ, hit వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మా్ణంలో మీట్ క్యూట్ అనే సినిమా రూపొందుతుంది. ఈ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాని సోదరి దీప్తి గంటా చేపట్టింది. ఇప్పటికే దీప్తి.. అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం అంటూ మీట్ క్యూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. అందులో సత్యరాజ్ కూర్చుని ఉండగా.. నాని క్లాప్ కొడుతున్న ఫోటోతో పాటు మరో ఫోటో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పెట్రోల్ భారం మోయలేక..గాడిద సాయం.మార్కెట్లో గాడిదల ధర కంటే, పెట్రోల్ ధరలే ఎక్కువ:Donkey vehicle Viral Video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
