Balakrishna memes: మీమ్స్‌పై బాలయ్య రియాక్షన్‌.. మాములుగా లేదు..! తన స్టయిలే వేరు అంటూ… నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

|

Feb 21, 2022 | 10:00 AM

Balakrishna reaction on memes: నట సింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసింది ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’. తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ఈ టాక్‌ షో అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటీటీ వేదికగా అత్యంత ప్రజాదరణ పొందిన టాక్‌ షోగా రికార్డు సాధించింది. మహేష్‌ బాబుతో జరిగిన ఎపిసోడ్‌తో


Balakrishna reaction on memes: నట సింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసింది ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’. తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ఈ టాక్‌ షో అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటీటీ వేదికగా అత్యంత ప్రజాదరణ పొందిన టాక్‌ షోగా రికార్డు సాధించింది. మహేష్‌ బాబుతో జరిగిన ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌ తొలి సీజన్‌ ముగిసిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే సెకండ్‌ సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూలై నుంచి సెకండ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆహా బాలకృష్ణను రాపిడ్‌ ఫైర్‌లా అడిగిన కొన్ని ప్రశ్నలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బాలకృష్ణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పేరుమీద సోషల్‌ మీడియాలో మీమ్స్‌ కూడా పెద్ద ఎత్తున వైరల్‌ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ డైలాగ్‌లు, డ్యాన్స్‌, ఫైటింగ్‌లపై పెద్ద ఎత్తున మీమ్స్‌ పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో పాల్గొన్న బాలయ్యను ఓ ప్రశ్నఅడిగారు. ‘మీపై వచ్చే మీమ్స్‌ గురించి ఎప్పుడైనా నవ్వుకున్నారా.?’ అన్న ప్రశ్నకు ‘నవ్వుకున్నాను’ కరోనా వచ్చిన సమయంలో లెజెండ్‌ సినిమాలోని డైలాగ్‌తో చేసిన మీమ్స్‌ చూసినప్పుడు నవ్వుకున్నాను అని తెలిపారు. ఇక ఎప్పుడైనా కాలేజికి బంక్‌ కొట్టారా అన్న ప్రశ్నకు ‘బంక్‌ కొట్టని వారు ఎవరు ఉంటారు చెప్పండి’ అంటూ బదులిచ్చారు. ఇలా పలు సరదా ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. మరి బాలయ్య బాబు చెప్పిన ఇంకొన్ని ఫన్నీ విశేషాలు వీడియోలో చూసేయండి..

మరిన్ని చూడండి ఇక్కడ:

Published on: Feb 21, 2022 09:58 AM