‘కింగ్ అయినా.. అనుబంధాలకు బానిసే!’ షోలో కన్నిళ్లు పెట్టుకున్న నాగ్..
బుల్లితెరపై టాక్ షోలకు ఎంతగా క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆమధ్య కాలంలో ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సూపర్ సక్సెస్ అయింది.ఆ షోతో హోస్టుగా నందమూరి బాలకృష్ణ అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మరో హీరో ఓ రియాల్టీ షోకు హోస్టింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనే విలక్షణ నటుడు జగపతి బాబు. ఇన్నాళ్లు అటు హీరోగా, విలన్ గా మెప్పించిన జగపతి బాబు.. ఇప్పుడు హోస్టుగా అలరించేందుకు వస్తున్నారు.
ఆయన హోస్టింగ్ చేస్తున్న రియాల్టీ షో జయమ్ము నిశ్చయమ్మురా. జీ తెలుగులో ఆగస్ట్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మొదటి ఎపిసోడ్ కు టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున గెస్టుగా వచ్చారు. రావడమే కాదు.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అందన్నీ ఎమోషనల్ అయ్యాలా చేశారు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే నాగార్జున.. చాలా కాలం తర్వాత ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో నాగ్ కెరీర్, ఫ్యామిలీ, కాలేజ్, స్కూల్.. ఇలా ప్రతి విషయం గురించి అడిగి తెలుసుకున్నారు జగపతి. ఈ క్రమంలోనే నాగార్జున సిస్టర్ సుశీల ఇదే షోకు ఎంట్రీ ఇచ్చారు. తన జీవితంలోని కష్టసమయంలో నాగార్జున తనకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారామె. అయితే నాగ సుశీల మాట్లాడుతున్న క్రమంలోనే నాగార్జున ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో షోలో ఉన్న వారు షాయ్యారు. అంతేకాదు తన తండ్రి నాగేశ్వర రావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ కూడా కింగ్ నాగ్ ఎమోషనల్ అయ్యారు. యాక్టింగ్ చేయాలనుకుంటున్నట్లు తన బ్రదర్ వెంకట్ తో కలిసి నాన్న దగ్గరికెళ్లి చెప్పానని చెప్పిన నాగ్.. అప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు చూశానన్నారు. ఆ తర్వాత అన్నమయ్య సినిమా చూసి రాగానే తన రెండు చేతులు పట్టుకుని నాన్న మాట్లాడిన క్షణాలు తాను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేంటూ గుర్తు చేసుకున్నారు నాగ్. అలాగే నాగేశ్వరరావు చివరి రోజులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు కింగ్ నాగార్జున.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ప్రేమ కథల్లో ఈ ప్రేమ కథ వేరయా..’ ఆకట్టుకుంటున్న ఒక పార్వతి.. ఇద్దరు దేవదాసులు
84 కోట్లు పెట్టి.. లగ్జరీ విల్లాను దక్కించుకున్న హీరోయిన్
పెళ్లైన ఆరు నెలల తర్వాత.. సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో…
అంతా నా కర్మ…! అందుకే నాకు ఇన్ని బాధలు.. అమర్ దీప్ ఎమోషనల్!