Darling Review: హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ ‘డార్లింగ్’ ప్రియదర్శి గెలిచాడా.?

|

Jul 20, 2024 | 11:29 AM

మల్లేశం, బలగం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. హీరోగా ఫస్ట్ టైమ్ ఓ కమర్షియల్ సినిమా చేసాడు. మరోవైపు యాక్సిడెంట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నభా నటేష్ కూడా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ జోడీ.. ఆడియన్స్ మనసులు గెలుచుకుందా.. డార్లింగ్ సినిమా ఎలా ఉంది..? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం..

మల్లేశం, బలగం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. హీరోగా ఫస్ట్ టైమ్ ఓ కమర్షియల్ సినిమా చేసాడు. మరోవైపు యాక్సిడెంట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నభా నటేష్ కూడా డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ జోడీ.. ఆడియన్స్ మనసులు గెలుచుకుందా.. డార్లింగ్ సినిమా ఎలా ఉంది..? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం..

రాఘవ్ అలియాస్ ప్రియదర్శికి చిన్నప్పట్నుంచి ఒకటే ఆశ ఉంటుంది. బాగా చదువుకుని.. సంపాదించి మంచి ఉద్యోగం తెచ్చుకుని.. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం పారిస్ వెళ్లాలని! తన కాలనీలో చిన్నపుడు ఓ టీచర్‌ను అలియాస్ సుహాస్‌ను చూసి ఈ నిర్ణయం తీసుకుంటాడు రాఘవ్. దానికోసమే కలలు కంటుంటాడు. అలాంటి రాఘవ్‌కు ఓసారి సైకాలజిస్ట్ నందిని అలియాస్ అనన్య నాగళ్ళతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ చివరి నిమిషంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దాంతో అందరూ రాఘవ్‌ను చూసి వెక్కిరిస్తారు. ఆ సమయంలో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు రాఘవ్. అప్పుడు అతడి ఆలోచనలు మార్చి.. చచ్చిపోకుండా ఆపుతుంది ఆనంది అలియాస్ నభా నటేష్. పరిచయం అయిన మూడు నాలుగు గంటల్లోనే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి అయిన మొదటి రాత్రే ఆనందిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆమెలోని ఆది అనే మరో వ్యక్తి బయటికి వచ్చి రాఘవ్‌ను ఇష్టమొచ్చినట్లు కొడుతుంది. అప్పట్నుంచి ఎప్పుడు భార్యను ముట్టుకోవాలని ప్రయత్నించినా అదే జరుగుతుంది. ఆమె సమస్య తెలుసుకుని సాల్వ్ చేసిన తర్వాత.. ఓసారి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది ఆనంది. కానీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది. అప్పుడే తెలుస్తుంది.. తన భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ కాదు.. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని.. ఆమెలో కేవలం ఆది మాత్రమే కాదు ఝాన్సీ, పాప, మాయ ఇలా మరో నలుగురు కూడా ఉంటారని! మరి అప్పుడు ఏం జరుగుతుంది..? వాళ్లందరినీ ఆనంది బాడీ నుంచి రాఘవ్ ఎలా బయటికి పంపించాడు అనేది అసలు కథ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.