TOP9 ET: బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో 100 ఎకరాల ఫిల్మ్ స్టూడియో.!

TOP9 ET: బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో 100 ఎకరాల ఫిల్మ్ స్టూడియో.!

Anil kumar poka

|

Updated on: Jul 20, 2024 | 11:37 AM

సౌత్ సినిమాలపై ఎప్పుడూ తమ అక్కసును వెళ్లగక్కే బాలీవుడ్‌ మాఫియాకు బిగ్ ఝలక్ ఇచ్చింది కల్కి మూవీ టీం. కల్కి మూవీ సాధించిన వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ ఫేక్ అంటూ.. కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్న ఓ ఇద్దరు ఫిల్మ్ క్రిటిక్స్‌ పై 25 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది ఈ మూవీ టీం. దీంతో పని గట్టకుని కల్కిపై విష ప్రచారం చేస్తున్న బాలీవుడ్‌ మాఫియా సైలెంట్ అయిపోయింది. దీంతో టాలీవుడ్‌ సినిమాల కారణంగా ఈ మాఫియాకు దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది.

01.kalki action: బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్ దెబ్బ మీద దెబ్బ!

సౌత్ సినిమాలపై ఎప్పుడూ తమ అక్కసును వెళ్లగక్కే బాలీవుడ్‌ మాఫియాకు బిగ్ ఝలక్ ఇచ్చింది కల్కి మూవీ టీం. కల్కి మూవీ సాధించిన వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ ఫేక్ అంటూ.. కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్న ఓ ఇద్దరు ఫిల్మ్ క్రిటిక్స్‌ పై 25 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది ఈ మూవీ టీం. దీంతో పని గట్టకుని కల్కిపై విష ప్రచారం చేస్తున్న బాలీవుడ్‌ మాఫియా సైలెంట్ అయిపోయింది. దీంతో టాలీవుడ్‌ సినిమాల కారణంగా ఈ మాఫియాకు దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది.

02.venkaiyya naiodu: కల్కి చూసి ఫిదా అయిన.. వెంకయ్య నాయుడు.

చిన్నోళ్లు .. పెద్దోళ్లు.. ముసలోళ్లు అనే తేడా లేకుండా.. చూసిన వారందరికి నచ్చుతున్న కల్కి మూవీ.. ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా ఫిదా చేసింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా చూసిన వెంకయ్య నాయుడు ఈ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ నాగిని మెచ్చుకున్నారు. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో, మహాభారతంలోని పాత్రలతో రూపొందిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించిందన్నారు. కల్కి సినిమా హాలీవుడ్‌ చిత్ర నిర్మాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని కొనియాడారు.

03. puri: డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు

సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తుల, సెలబ్రిటీల డైలాగ్స్‌ను పాటల్లో వాడటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను పట్టుకునే ప్రయత్నం చేసిన పూరీ జగన్నాద్ చిక్కుల్లో పడ్డారు. తన అప్‌ కమింగ్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ లోని ‘మార్ ముంతా చోడ్ చింతా’ సాంగ్‌లో.. కేసీఆర్ క్యాజువల్ డైలాగ్‌ ‘ఏం చేద్దాం అంటావ్‌ మరి’ అనే లైన్‌ ను వాడారు. అయితే ఇది కాస్తా… ఇప్పుడు ఇష్యూగా మారింది. ఐటెం సాంగ్‌లో బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు.. మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్‌ వాడడం.. ఆ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు అభ్యంతరకం అయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే ఈ పార్టీ కార్యకర్తలైన రజితా రెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి పూరీ జగన్నాద్ పై కంప్లైట్ చేశారు. ఆయనపై యాక్షన్ తీసుకోవాలని రెక్వెస్ట్ చేశారు.

04.vishwak sen: పాపం విశ్వక్ సేన్.. దెబ్బకి అడ్రస్ మార్చేశాడట.?

పాపం విశ్వక్ సేన్, దెబ్బకి అడ్రస్ మార్చేశాడట. అవును ! కాస్త పాపులారిటీ వస్తే.. చాలు చిన్నా చితకా సినిమాలకు హీరోలు గెస్ట్‌లుగా రావడం కామన్. అయితే ఈ కామన్‌ థింగ్‌ కాస్త విశ్వక్ కు రిపీటెడ్‌ థింగ్‌గా మారిందట. స్టార్ హీరో గా మారడం.. తన మాటలతో జనాలను ఆకట్టుకోవడం.. ఫిల్మ్ నగర్ నడి ఒడ్డులో అందరికీ అందుబాటులో ఉండడంతో.. చోటా మోటా మేకర్స్ అందరూ.. తమ సినిమా టీజర్, ట్రైలర్ లాంచ్‌లకు విశ్వక్‌ నే పిలుస్తున్నారట. దీంతో వారికి నో చెప్పలేక.. తన షెడ్యూల్స్‌ సర్ధుకోలేక.. దెబ్బకి మకాం మార్చారట. ఫిల్మ్ నగర్లోని తన ఇంట్లో కాకుండా.. గచ్చిబౌలిలోని తన సొంతంగా కొనుకున్న ప్లాట్‌లోకి మారిపోయాడట ఈ హీరో.

05.puri: పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.

కొడితే దిమ్మతిరిగే రేంజ్లోనే కాదే.. మైండ్‌లోకి వెళ్లి మరీ తిష్ట వేసే రేంజ్లోనే ఉంటాయి పూరీ డైలాగులు. అయితే పూరీ పెన్ను నుంచి బయటికి వచ్చిన ఇలాంటి డైలాగే ఒకటి.. చాలా విచిత్రంగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మోనికా బెల్లూచి చేరి.. ఆమెను ఇంప్రెస్ చేసిందట. యూరప్ కు చెందిన ఓ వ్యక్తి.. ఓ క్లాత్‌ పై..! గ్లోబల్ వార్మింగ్‌ పై.. సెలబ్రిటీలందరి ఓపీయన్ తీసుకునే కార్యక్రమం మొదలెట్టారాట. ఆ క్రమంలో.. ప్రభాస్‌ బుజ్జిగాడు సెట్లోకి వచ్చి పూరీని కూడా తన ఒపీనియన్ను తన బ్యానర్‌ క్లాత్‌ పై రాయాలని రిక్వెస్ట్ చేశారట. దాంతో పూరీ.. తన మైండ్‌కు పని చెప్పి మరీ.. ఓ కొటేషన్ రాశారట. అయితే పూరీ రాసిన ఈ లైన్స్‌ చూసిన మోనికా బెల్లూచి.. ఫిదా అయి పూరీకి మెయిల్ చేసి మరీ అప్రిషియేట్ చేశారట. అయితే ఇది బుజ్జిగాడు టైంలో జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో పూరీ చెప్పారు. ఇప్పుడా వీడియో మరో సారి నెట్టింట వైరల్ అవుతోంది.

06.allu arjun: యూరప్‌ వెకేషన్లో తెగ ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ

పుష్ప2 సినిమా సెట్స్‌లో నిన్న మొన్నటి వరకు బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ సినిమా షూట్‌లో బ్రేక్ దొరకడంతో.. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లారు. వెళ్లడమే కాదు.. తన ఇద్దరూ పిల్లలు.. తన భార్య స్నేహతో క్వాలిటీ టైం గడుపుతూ.. యూరప్ అందాలను.. ఫూడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన వైఫ్ స్నేహ ఎప్పుటి కప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుండడంతో.. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

07.film Studio: ఏపీలో 100 ఎకరాల ఫిల్మ్ స్టూడియో…

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ఫిల్మ్ మేకింగ్‌కు ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుతోంది ఏపీ. ఇప్పటికే టికెట్‌ రేట్స్‌తో సహా.. షూటింగ్‌కు సంబంధించిన అన్ని పర్మిషన్స్‌ను సులభతరం చేసింది.. అక్కడి కొత్త ప్రభుత్వం. ఈ క్రమంలోనే కొంత మంది తెలుగు స్టార్ ప్రొడ్యూసర్లు సిండికేట్‌గా మారి 100 ఎకరాల్లో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలలో ఈ భారీ స్టూడియోని నిర్మించే ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. ఈ విషయంగానే త్వరలో డిప్యూటీ సీఎం పవన్‌ను.. సీఎం చంద్రబాబును కలువనున్నారని టాక్.

08.darshan: పాపం! దర్శన్‌కు కష్ట కాలం కంటిన్యూ…

దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ జూలై 18తో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు… దర్శన్‌తో సహా.. పవిత్ర గౌడ, ఇతర నిందితుల కస్టడీని పొడిగించింది.

10.raj tharun: బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్‌ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్!

రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్‌తరుణ్, మాల్విమల్హోత్రా చాట్ ను తాజాగా లీక్ చేసింది లావణ్య. రాజ్‌తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్‌షాట్స్‌‌ను.. పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్‌లో లావణ్య జతపరిచింది. అవి కాస్తా ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇక హీరో రాజ్ తరుణ్, మల్హోత్రా మెసేజ్ చాటింగ్‌లో.. వారి డేటింగ్‌‌, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. వారిద్దరూ ఏ హోటల్‌ రూమ్స్‌లో కలుసుకున్నారు.. వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్‌ తరుణ్‌ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన చాట్స్‌ లీక్‌ కావడం సంచలనంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.