AR Rahaman: మరో వివాదంలో మ్యూజిక్‌ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌..! అసలేం జరిగిందంటే..

|

Oct 05, 2023 | 7:10 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారింది. నిర్వహణ వైఫల్యం కారణంగా అర్థాంతరంగా మ్యూజిక్‌ కాన్సర్ట్‌ను ముగించడం విమర్శలకు దారి తీసింది. తాజాగా రెహమాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2018లో ఓ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం రెహమాన్‌ డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేదని చెన్నై సర్జన్స్‌ అసోసియేషన్‌ పోలీస్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారింది. నిర్వహణ వైఫల్యం కారణంగా అర్థాంతరంగా మ్యూజిక్‌ కాన్సర్ట్‌ను ముగించడం విమర్శలకు దారి తీసింది. తాజాగా రెహమాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2018లో ఓ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం రెహమాన్‌ డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేదని చెన్నై సర్జన్స్‌ అసోసియేషన్‌ పోలీస్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. 29 లక్షల రూపాయలు తీసుకున్న రెహమాన్ ఒప్పందానికి అనుగుణంగా సంగీత కార్యక్రమం నిర్వహించలేదని ఆరోపించింది. దీనిపై రెహమాన్ న్యాయవాది స్పందించారు. రెహమాన్ పై నమోదు చేసిన కేసును మూడు రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని కోరారు. 10 కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్యుల సంఘం చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ, ఇందులో మూడో పక్షం జోక్యం ఉన్నట్టు ఆరోపించారు. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైద్యుల సంఘాన్ని న్యాయవాది కోరారు. ఇక ఒక్కరోజు మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం రెహమాన్‌కు 25లక్షలు చెల్లించాల్సిన అవసరం లేదని రెహమాన్‌ సన్నిహితులు వాదిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, రెహహన్‌ ప్రతీ విషయంలో ఒప్పందం ప్రకారమే నడుచుకుంటాడని ఆయన మేనేజర్‌ సెంథిల్‌ వేలన్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..