Mithun Chakraborty: షూటింగ్లోనే కుప్పకూలిన స్టార్ హీరో.! ఆస్పత్రికి తరలింపు.

Mithun Chakraborty: షూటింగ్లోనే కుప్పకూలిన స్టార్ హీరో.! ఆస్పత్రికి తరలింపు.

Anil kumar poka

|

Updated on: Feb 11, 2024 | 5:05 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు , రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఓ షూటింగ్లో ఉండగానే ఆయనకు ఛాతీ నొప్పితో వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన్ను కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ మూవీ సిబ్బందే చేర్చారట. ప్రస్తుతం మిథున్‌కు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మిథున్ చక్రవర్తి కి MRI స్కాన్ చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ సీనియర్ నటుడు , రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఓ షూటింగ్లో ఉండగానే ఆయనకు ఛాతీ నొప్పితో వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన్ను కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ మూవీ సిబ్బందే చేర్చారట. ప్రస్తుతం మిథున్‌కు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మిథున్ చక్రవర్తి కి MRI స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. వైద్యులు అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారని.. అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి సిబ్బంది ఆయన హెల్త్‌కు సంబంధించి ఎలాంటి బులిటెన్ బయటికి రిలీజ్ చేయకపోవడం.. అందర్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరో, డిస్కోడ్యాన్సర్ అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. నేటికీ మిథున్ చక్రవర్తికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు బయటికి రావడంతో.. అభిమానులు అందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..