చిరు – ఓదెల సినిమాపై సెన్సేషనల్ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవి రాబోయే రెండేళ్లలో నాలుగు భారీ చిత్రాలతో అలరించనున్నారు. విశ్వంభర, బాబీ సినిమాలతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 2026 మధ్యలో ఓదెల-చిరు చిత్రం సెట్స్‌పైకి రానుంది. నాని సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం బ్లడ్ బాత్ ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు. చిరు ఫ్యాన్స్‌కు పండుగే!
మన శంకరవరప్రసాద్ గారు గోలలో పడి చిరంజీవి విశ్వంభరతో పాటు మరో రెండు సినిమాలకు కమిటయ్యారనే విషయమే మరిచిపోయారు. ఇందులో బాబీ ఓకే కానీ.. శ్రీకాంత్ ఓదెల సినిమా పరిస్థితేంటి..? ఈ కాంబో ఎప్పుడు సెట్స్‌పైకి రానుంది..? దీనికి సమాధానం దొరికేసింది.. ఇకపై చూస్తారుగా ఈ చిరు చిందించే రక్తం అంటూ.. ఏకంగా బ్లడ్ ప్రామిస్ చేసారు మెగాస్టార్. మరి అదేంటో చూద్దామా..? నిజమే.. మాస్ అంటే ఒక జనరేషన్‌కు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఒకప్పుడు ఆయన సినిమాలు మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. కానీ రీ ఎంట్రీలో మెగా మేనియా అప్పుడప్పుడే కనిపిస్తుంది. ఖైదీ నె 150, వాల్తేరు వీరయ్య సినిమాలతో రచ్చ చేసినా.. మధ్యలో కొన్ని నిరాశ పరిచాయి. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారుతో పండక్కి వచ్చేస్తున్నారు చిరు. చిరంజీవితో వశిష్ట చేస్తున్న విశ్వంభర సోషియో ఫాంటసీ.. అనిల్ రావిపూడి ఏమో కామెడీతో వస్తున్నారు. దాంతో మెగా మాస్ పూర్తిగా చూపించే ఛాన్స్ శ్రీకాంత్ ఓదెల తీసుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో బాబీతో గ్యాంగ్ స్టర్ డ్రామా చేయాలని చూస్తున్నారు చిరు. ఈలోపు ప్యారడైజ్ పూర్తి చేయనున్నారు శ్రీకాంత్ ఓదెల. 2026 మిడ్‌లో చిరు, ఓదెల సినిమా మొదలవుతుందని చెప్పారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. చిరంజీవి, ఓదెల శ్రీకాంత్ సినిమాకు నాని సమర్పకుడిగా ఉన్నారు. ఇందులో బ్లడ్ బాత్ చేయిస్తానంటున్నారీయన. 2026 సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు, సమ్మర్‌కు విశ్వంభర రానున్నాయి. 2027 సంక్రాంతికి బాబీ.. సమ్మర్ సీజన్‌కు శ్రీకాంత్ ఓదెల సినిమా రానున్నాయి. ఈ లెక్కన రాబోయే రెండేళ్లలో 4 సినిమాలు చిరు నుంచి రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
T20 వరల్డ్‌కప్‌కు టీమిండియా ఆటగాళ్లు వీరే
అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత
అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ
