Chiranjeevi: ఒక్కసారిగా.. తమ్ముడిని సర్‌ప్రైజ్‌ చేసిన మెగాస్టార్

Updated on: Jul 02, 2025 | 2:46 PM

పెండింగ్‌లో ఉన్న సినిమాలను ఫినిష్ చేసే పని పెట్టుకున్న పవన్‌ కళ్యాణ్‌.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్లో ఉన్నారు. ఆ సినిమా షూట్‌ను జెట్ స్పీడ్‌లో ముగించేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆయన సినిమా సెట్‌కు మెగా స్టార్ వెళ్లారు. తన ప్రజెన్స్‌తో... తన తమ్ముడిని సర్‌ప్రైజ్ చేశారు చిరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా బిజీ అయ్యారు.

ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లోనూ వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహరవీరమల్లు సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో నటిస్తున్నారు పవన్. ఈ సినిమా షూటింగ్ కూడా ముగిసింది. తొందర్లో రిలీజ్ కానుంది. ఇక ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. గతంలో పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. తాజాగా ఈ సినిమా సెట్‌లో మెగాస్టార్ మెరిశారు. ఉస్తాద్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. చిరంజీవి ఈ సినిమా సెట్స్‌కి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు. షూటింగ్‌ విశేషాలను పవన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు మెగా ఫ్యామిలీ స్టార్స్ కలిసి కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం రీల్స్‌ పిచ్చి.. 20 అంతస్థుల బిల్డింగ్‌ టెర్రస్‌పై నుండి మహిళ..??

లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు

కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్

కంగారు కైకు.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. చివరికి

ఇంటి మూలన చిన్న రంధ్రం నుండి వింత శబ్దాలు.. దగ్గర వెళ్లి చూసి ఖంగు తిన్నారు.