Mega Family Christmas: ఒక్క ఫోటోతో.. రూమర్స్‌కు చెక్‌.! ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ అంతా.

|

Dec 27, 2023 | 11:01 AM

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పండగ సంబరాల్లో ఎంజాయ్ చేశారు. ఇక ఇటు భారతదేశంలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక సినీతారల పండగ సందడి గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీతో క్రిస్మస్ పండగ జరుపుకుని.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే లేట్ అయినా అందరి చూపును తనవైపు తిప్పుకునే ఫోటో ఒకటి..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పండగ సంబరాల్లో ఎంజాయ్ చేశారు. ఇక ఇటు భారతదేశంలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక సినీతారల పండగ సందడి గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీతో క్రిస్మస్ పండగ జరుపుకుని.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే లేట్ అయినా అందరి చూపును తనవైపు తిప్పుకునే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ ఎవరిది అనుకుంటున్నారా ?.. అదే మెగా ఫ్యామిలీ ఫోటో.. మెగా కుటుంబంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటో..! ప్రతి పండక్కి మెగా ఫ్యామిలీలలో అందరూ కలిసి సెలబ్రెట్ చేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పవన్, నాగబాబు, సాయి ధరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కుటుంబాలు కలిసి సందడి చేస్తుంటాయి. అలాగే కొని సందర్భాల్లో అల్లు ఫ్యామిలీ కూడా కలుస్తుంటుంది. తాజాగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ మాత్రం అల్లు, మెగా కుటుంబాలు కలిసి జరుపుకున్నాయి.

క్రిస్మస్ కోసం మెగా హీరోలతోపాటు కజిన్స్ అంతా ఒక్కచోట చేరారు. సాయి దరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, శ్రీజ కొణిదెల, అల్లు శిరీష్ , అల్లు బాబీ, సుస్మిత.. ఇలా మరికొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. అందులో అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక చాలా రోజులుగా చరణ్, బన్నీ మధ్య మాటలు లేవంటూ రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొద్దిరోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటలు లేవంటూ మరోసారి రూమర్స్ వినిపించాయి. ఇప్పటికే ఈ విషయం పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న ఫోటోతో మరోసారి బన్నీ, చరణ్ గురించి వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.