మాస్ మహారాణిగా మారిపోయిన రష్మిక వీడియో
మనకు తెలుగులో మాస్ మహారాజా ఉన్నాడు కానీ మాస్ మహారాణి లేరు. ఇప్పుడు ఆ ప్లేస్ కోసం ఒకరిద్దరు హీరోయిన్లు బాగా గట్టిగానే పోటీ పడుతున్నారు. అందులో మిగిలిన వాళ్లతో పోలిస్తే ఓ హీరోయిన్ ముందుంది. తాజాగా మరో టీజర్‌తో మామూలు రచ్చ చేయట్లేదామె..! ఆ మేకోవర్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఇంతకీ ఎవరా మాస్ మహారాణి..?
చూస్తున్నారుగా.. అక్కడ కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా..? మొన్నటికి మొన్న గాళ్ ఫ్రెండ్ సినిమాలో తనదైన నటనతో అందర్నీ మెప్పించిన రష్మిక మందన్ననే ఇప్పుడు మైసా అంటూ ఊర మాస్ పాత్రతో వచ్చేస్తున్నారు. టీజర్ చూస్తుంటేనే.. సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. గాళ్ ఫ్రెండ్ క్లాస్ అయితే.. మైసా పూర్తిగా రెబల్.
ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమాగా వస్తుంది మైసా. ఇందులో తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు రష్మిక. ఇన్నాళ్లూ చాలా క్లాసీగా, రొమాంటిక్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. మైసా కోసం ఊహించని విధంగా మేకోవర్ అయిపోయారు. ఘాటీలో అనుష్క.. రాక్కాయిలో నయనతార ఇలా మాసీగానే కనిపించారు. ఇప్పుడు రష్మిక వాళ్లను ఫాలో అయిపోతున్నారు.కొన్నేళ్లుగా చాలా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు రష్మిక. పుష్ప 2, ఛావా, యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారీమే. మొన్న గాళ్ ఫ్రెండ్‌తో మరో మెట్టు ఎక్కేసారు. తాజాగా మైసాతో ఈ అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయేలా కనిపిస్తుంది. మొత్తానికి మైసాతో మాస్ మహారాణి టైటిల్ కొట్టేలాగే కనిపిస్తున్నారు నేషనల్ క్రష్.
మరిన్ని వీడియోల కోసం :