Loading video

Manchu Manoj: ‘నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న’ మనోజ్‌ ఎమోషనల్ ట్వీట్

|

Mar 20, 2025 | 4:56 PM

తన తండ్రి, నటుడు మోహన్‌బాబు పుట్టినరోజు పురస్కరించుకొని మనోజ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. హ్యాపీ బర్త్‌డే నాన్న.. మనమంతా కలిసి వేడుకలను చేసుకునే ఈరోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం. మీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్‌ యూ అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు, మంచు లక్ష్మి కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

హ్యాపీ బర్త్‌డే నాన్న.. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషం, ప్రశాంతంగా జీవించాలని ఆ దేవుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటా అని తెలిపారు. మోహన్‌బాబు కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు నెలకొన్నాయి. తాను సంపాదించిన ఇల్లు.. ఆస్తులను మనోజ్‌ ఆక్రమించారంటూ మోహన్‌బాబు ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్దిరోజుల క్రితం తన ప్రతినిధితో లేఖను కూడా పంపించారు.వివాదాల నేపథ్యంలో మనోజ్‌ పెట్టిన పోస్ట్‌ ఆసక్తికరంగా మారింది. మూడు నెలల నుంచి ఏదో ఓ వివాదంతో వార్తల్లో ఉంటున్నారు మంచు మనోజ్. తన తండ్రితో ప్రాబ్లం లేదని మనోజ్‌ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. తన తండ్రిని అడ్డం పెట్టుకొని విష్ణు నాటకం ఆడుతున్నారనేది మనోజ్ ఆరోపణ. తాను ఎప్పుడూ తన తండ్రిని వ్యతిరేకించలేదని ఇప్పటికే స్పష్టం చేసారు మనోజ్‌. సోషల్ మీడియా వేదికగా మనోజ్ – విష్ణు మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో తండ్రి మోహన్‌బాబుకు మనోజ్‌ శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తిగా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు

పెళ్లి చేసుకోమని శ్రీదేవి రిక్వెస్ట్.. అప్పట్లో షాకిచ్చిన మురళీ మోహన్

మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్‌..! మీకు దండేసి దండం పెడతాం