12 ఏళ్ల కూతురురే నటి రెండో పెళ్లికి పెళ్లి పెద్ద

Updated on: Aug 24, 2025 | 8:21 AM

తల్లీ కానీ, తండ్రి కానీ రెండో పెళ్లి చేసుకుంటానంటే చాలా మంది పిల్లలు అంగీకరించరు. కానీ ఈ ప్రముఖ నటి పెళ్లికి తన 12 ఏళ్ల కూతురు తోడుగా నిలిచింది. స్వయంగా తల్లిని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది. ఇక తల్లి మెడలో మూడుముళ్లు పడుతున్నప్పుడు ఆ కూతురు ముఖంలో ఆనందం చూడాలి.. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇలా 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్నారు ఓ నటి.

ఆమె ఎవరో కాదు.. మలయాళ యాంకర్ కమ్ ఫేమస్ నటి ఆర్య. మలయాళంలో ఫేమస్ నటిగా వెలుగొందుతోన్న ఆర్య.. నటుడు, కొరియోగ్రాఫర్‌ సిబిన్‌ బెంజమిన్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. ఇది ఇద్దరికీ రెండో వివాహమే. ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్య- సిబిన్. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరి పెళ్లి వీడియోలో ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్‌ ఖుషి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పెళ్లి వేడుకలో భాగంగా తన తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది. అలాగే తల్లి మెడలో మూడు ముళ్లు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఈ ఫొటోలను చూసి ప్రియ మణి, పూర్ణ, అశ్వతి శ్రీకాంత్, అర్చన సుశీలన్ తదితర ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలుపు తీద్దామని పొలానికి వెళ్తే.. లక్ష్మీ దేవి తలుపు తట్టింది

బన్నీకే మొదటి ప్రాధాన్యత దీపిక నిర్ణయంతో.. బాలీవుడ్‌ మేకర్స్‌ షాక్‌

పాపం! ఆ సినిమా కూడా చేసుంటే.. ఈ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదిగా..

ఈ అరవ ప్రేమకథ ఎలా ఉంది? హిట్టా..? ఫట్టా..?