Guntur Karam Runtime: 2గంటల 39 నిమిషాలు.! బాబు మాస్ అవతార్‌తో పూనకాలు పక్కా.
'గుంటూరు కారం' ప్రమోషన్స్ జోరు కొనసాగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెర పడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా ‘గుంటూరు కారం’.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఇక ప్రచారాల్లో భాగంగా విడుదలైన పాటలు కూడా ఫిల్మ్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ జోరు కొనసాగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెర పడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా ‘గుంటూరు కారం’.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఇక ప్రచారాల్లో భాగంగా విడుదలైన పాటలు కూడా ఫిల్మ్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ఇటీవల విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ పాటతో ఈ మూవీ పై నెట్టింట క్రేజీ బజ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట మరో సారి గుంటూరోణ్ణి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
ఎస్ ! గుంటూరు కారం.. రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా మొత్తం 159 నిమిషాలు అంటే 2 గంటల 39 నిమిషాలు ఉంటుందట. అయితే అందులో చివరి 45 నిమిషాలు.. బాబు సిల్వర్ స్క్రీన్ పై బీభత్సం చేస్తాడనే హింట్ రీసెంట్‌గా కూడా ఇచ్చేశాడు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ. దీంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అవి కాస్తా అకాశాన్ని అంటేస్తూ.. గుంటూరోన్ని మోస్ట్ ట్రెండింగ్ సినిమాగా మారుస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.