Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా

Edited By:

Updated on: Jan 20, 2026 | 4:27 PM

రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ బాబు తర్వాతి సినిమా ఏమిటనేది అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇతర హీరోలు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై స్పష్టతతో ఉండగా, మహేష్ మాత్రం ఇంకా అనిశ్చితిలో ఉన్నారు. రాజమౌళి చిత్రాల నిడివిపై ఆందోళనతో పాటు, సందీప్ వంగా, బుచ్చిబాబు వంటి దర్శకులతో రాబోయే సినిమా రూమర్లపై అభిమానులు వేచి చూస్తున్నారు.

పవన్, తారక్, బన్నీ, చెర్రీ.. అందరూ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద క్లారిటీగా ఉన్నారు. ఇంకా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించని హీరో మన దగ్గర మహేష్ ఒక్కరేనేమో. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మహేష్ రాజమౌళితోనే కంటిన్యూ అవుతారా? లేకుంటే కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉంటారా? డ్రీమ్స్ భారీగా ఉన్నప్పుడు, ట్రావెల్‌ పెద్దగా ఉన్నప్పుడు ఓపిక అవసరమే అన్నది మహేష్‌ ఫ్యాన్స్ మనసులో మాట. అలాగని తమ అభిమాన హీరో జస్ట్ ఒక్క ప్రాజెక్ట్ మీదే ఫోకస్‌ చేసి, నెక్స్ట్ ఏంటనే విషయాన్ని పట్టించుకోవడం లేదా? అనే దిగులు కూడా ఓ వైపు వెంటాడుతోంది వారిని. రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు హీరోలు ఎలా లాక్‌ అయిపోతారో ప్రభాస్‌, తారక్‌, చెర్రీని చూసిన వారందరికీ చాలా బాగా తెలుసు. అయినా, ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్‌ కాబట్టి ప్లానింగ్‌ పక్కాగా ఉంటుంది.. అనుకున్న సమయానికి అన్నీ అయిపోతాయి కాబట్టి, తమ హీరో కూడా త్వరగానే రిలీవ్‌ అవుతారని ఫ్యాన్స్ కి చిన్ని ఆశ. రాజమౌళి కాంపౌండ్‌ విషయాలు ఎలా ఉన్నా, మహేష్‌ నెక్స్ట్ ఏంటన్నది మాత్రం ఫ్రెష్‌గా చర్చల్లో నలుగుతోంది. స్పిరిట్‌ కెప్టెన్‌ సందీప్‌ వంగాతో ట్రావెల్‌ చేస్తారని, పెద్ది డైరక్టర్‌ బుచ్చిబాబు సానా చెప్పిన పాయింట్‌ నచ్చిందని… కోలీవుడ్‌ కెప్టెన్లతో మూవ్‌ అయ్యే అవకాశాలున్నాయని.. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ మనసులో ఏం ఉందనేది తెలియాలంటే లెట్స్ వెయిట్‌ అండ్‌ వాచ్‌… ఎవరు పేరు చెప్పినా ఓకే.. కానీ, త్వరలోనే చెప్పేయండి సార్‌ అని అడగకనే అడుగుతున్నారు అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్.. యాక్షన్ రూట్ లో సీనియర్ బ్యూటీస్

2027 సమ్మర్ క్లాష్.. ఇప్పటి నుండే రచ్చ రచ్చ

కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే కలెక్షన్ల వర్షం.. లేకుంటే

Ram Charan: నా కెరీర్ లోనే ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.. అంటున్న చెర్రీ