Guntur Kaaram: అక్షరాలా 132కోట్లు.! రిలీజ్‌కు ముందే కుప్పలు తెప్పులుగా కలెక్షన్స్‌.

|

Jan 12, 2024 | 8:08 AM

సంక్రాంతి సినిమాల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ గురూజీ చేసిన సినిమా ఇది. మరోవైపు మహేష్ బాబు కూడా వరసగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గుంటూరు కారం అంటూ పక్కా మాస్ సినిమాతో వచ్చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

సంక్రాంతి సినిమాల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ గురూజీ చేసిన సినిమా ఇది. మరోవైపు మహేష్ బాబు కూడా వరసగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గుంటూరు కారం అంటూ పక్కా మాస్ సినిమాతో వచ్చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. మహేష్ కెరీర్‌లోనే హైయ్యస్ట్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఇక మహేష్ గుంటూరు కారం మూవీ.. నైజాంలో 42 కోట్లు, సీడెడ్లో 13.75 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, ఈస్ట్లో 8.6 కోట్లు, వెస్ట్లో 6.5 కోట్లు, గుంటూరులో 7.65 కోట్లు.. అలాగే కృష్ణాలో 6.50 కోట్లు, నెల్లూరులో 4 కోట్లు.. మొత్తంగా ఏపీ, తెలంగాణలో… 102కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది గుంటూరు కారం మూవీ. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్లో 20 కోట్లు… టోటల్ వరల్డ్ వైడ్ 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది గుంటూరు కారం సినిమాకి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos