Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'కర్మ ఎవర్నీ వదలదమ్మా'.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ

‘కర్మ ఎవర్నీ వదలదమ్మా’.. అంటూ.. మహేష్ ఫ్యాన్స్ రచ్చ

Phani CH

|

Updated on: Jul 14, 2023 | 9:47 AM

కర్మ ఎవర్నీ వదలదంటారు. సినిమా భాషలో చెప్పాలంటే.. పూరీ డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే... 'దూల తీర్చేస్తదని' అంటారు. మరి అలాంటి కర్మే.. ఇప్పుడు సమంతను కూడా గట్టిగా కొట్టిందంటూ.. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్సు.

కర్మ ఎవర్నీ వదలదంటారు. సినిమా భాషలో చెప్పాలంటే.. పూరీ డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే… ‘దూల తీర్చేస్తదని’ అంటారు. మరి అలాంటి కర్మే.. ఇప్పుడు సమంతను కూడా గట్టిగా కొట్టిందంటూ.. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్సు. కామెంట్స్‌ చేయడమే కాదు.. డిసెంబర్ 13లో సామ్ చేసిన ఓ పోస్ట్‌ను.. ఇప్పుడు బయటికి తీసి మరీ.. నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. కర్మ ఎవర్నీ వదలదమ్మా అంటూ.. ఎద్దేవా చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. అప్పట్లో అంటే 2013లో స్టార్ హీరోయిన్‌గా వరుస ఛాన్సులతో దూసుకుపోతున్న సమంత.. మహేష్ బాబు పోస్టర్‌ను ఎయిమ్ చేస్తూ… ఓ కాంట్రవర్సీ ట్వీట్ చేశారు. ‘మహేష్ వన్ నేనొక్కడినే’ సినిమా పోస్టర్‌ను ట్యాగ్ చేసి.. అందులో మహేష్ కాళ్ల దగ్గర హీరోయిన్ ఉండడాన్ని ఉద్దేశిస్తూ.. ‘ఇట్ ఈజ్ డీప్‌లీ రిగ్రసివ్ అంటూ… తన ట్వీట్లో రాసుకొచ్చారు. అలా అప్పట్లో తాను చేసిన ట్వీట్తో.. మహేష్ ఫ్యాన్స్ను.. ఇటు వన్ నేనొక్కడినే మేకర్స్‌ను ఫీలయ్యేలా చేశారు సామ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Devara: దేవర షూటింగ్ అప్‌డేట్.. ఈ కష్టం మరెవరికీ రాకూడదయ్యా అంటూ కామెంట్స్

Nagarjuna: మరో బిగ్ బాస్ సీజన్ రెడీ.. తెలుగులో హోస్ట్ ఎవరంటే ??

Nithiin: పాపం నితిన్ !! చివర్లో హ్యాండిచ్చిందిగా.. రాక్షసి !!