3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్

Updated on: Aug 08, 2025 | 8:40 PM

ఇటీవలి కాలంలో కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు అంచనాలకు అందనంతగా దూసుకెళ్లి, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. బడ్జెట్ ఎంత? అనే దానికంటే కథలో నిజంగా దమ్ముంటే.. సినిమా సూపర్ సక్సెస్ ఖాయమని నిరూపిస్తున్నాయి. ఇటీవల రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైయారా’ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

తాజాగా కోవలో మరో చిత్రం తన సత్తా చాటుతోంది.కన్నడలో విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ అనే చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు జెపి తుమినాధన్ తొలిసారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 25న థియేటర్లలో విడుదలై.. ఇంకా నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తోంది. భారీ మార్క్‌ని క్రాస్ చేస్తూ పలు రికార్డులను బద్దలు కొడుతోంది. భారీ బడ్జెట్​ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడుతున్న సమయాల్లో ఇలాంటి చిన్న సినిమాలే నిర్మాతలకు ఊరటనిస్తున్నాయి. ‘సు ఫ్రమ్ సో’ సినిమా రూ.3 కోట్ల ఖర్చుతో తెరకెక్కగా, తొలి 10 రోజుల్లోనే రూ.40 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.అదే నెట్ కలెక్షన్లు తీసుకుంటే రూ.30 కోట్ల దాటేసింది. అలా పెట్టుబడి ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకు రూ.3 కోట్లు పెడితే, రూ.30 కోట్ల మార్క్ క్రాస్ అయ్యింది. అంటే ట్రేడ్​ వర్గాల ప్రకారం ఇది 878 శాతం ప్రాఫిట్. ఇప్పటికే మంచి టాక్ తో నడుస్తున్న ఈ మూవీ లాంగ్ రన్​లో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. కాగా, కన్నడలో ఇంత భారీ విజయం సాధించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కానుంది. తెలుగులోనూ ‘సు ఫ్రమ్ సో’ అనే పేరుతోనే మైత్రి మూవీ మేకర్స్ ఆగస్టు 8న విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్​ కు మంచి స్పందన వస్తోంది. మంచి కథ, కంటెంట్ ఉన్న ఈ మూవీని కన్నడ ప్రేక్షకుల మాదిరిగానే తెలుగు వారూ ఆదరిస్తారని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహారం తింటున్న సింహాన్ని వీడియో తియ్యాలనుకున్నాడు.. అంతే

చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి లక్షల కోట్లు..! అసలేం జరిగిందంటే.

New Traffic Rules: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే.. అంతే

గుడ్‌న్యూస్‌.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు

Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?