అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆమె.. ఇటీవలే మెగా ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి తర్వాత.. ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక సిరీస్ ప్రమోషన్స్‌లోనే తన పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమి మారలేదని.. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలని నాకెవరూ పరిమితులు పెట్టడం లేదని.. మిస్ పర్ఫెక్ట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పింది లావణ్య. కెరీర్ పరంగా తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని.. వరుణ్ తేజ్ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారని.. కూడా చెప్పింది. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం కంటే.. ఇంకేం కావాలని ఓ డైలాగ్‌కు కూడా.. విసిరింది. విసరడమే కాదు.. ప్రస్తుతం తన కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos