అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌

Updated on: Dec 22, 2025 | 12:49 PM

ఉప్పెన తర్వాత కోలీవుడ్‌కి వెళ్లిన కృతి శెట్టి కెరీర్ ఊహించని మలుపులు తిరుగుతోంది. అవకాశాలు వచ్చినా, కార్తి 'అన్నగారు వస్తారు', ప్రదీప్ రంగనాథన్ 'LIK', జయం రవి 'జీని' వంటి మూడు పెద్ద ప్రాజెక్టులు ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ 'అన్ లక్కీ' బ్యూటీకి సినిమాలు విడుదల కాకపోవడం తీవ్ర నిరాశను మిగులుస్తోంది.

బ్యాడ్ లక్ బ్యాక్ పాకెట్‌లో ఉన్నపుడు ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం..? వరసగా వాయిదాలు పడుతున్నపుడు చేతిలో ఎన్ని సినిమాలుంటే మాత్రం ఏం లాభం..? ఎవరి గురించబ్బా ఈ ఇంట్రో అనుకుంటున్నారు కదా..? తినబోతూ రుచెందుకు.. చూడబోతూ డీటైల్స్ ఎందుకు..? ఆ అన్ లక్కీ బ్యూటీ ఎవరో మీరే చూసేయండి.. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఉన్నఫలంగా అరడజన్ సినిమాలు చేసి.. ఉన్నట్లుండి తెలుగు ఇండస్ట్రీ నుంచి మాయమైపోయిన బ్యూటీ కృతి శెట్టి. టాలీవుడ్‌లో ఊహించిన దానికంటే ఎక్కువగా కృతికి షాక్‌లు త‌గిలాయి. దాంతో కోలీవుడ్‌కు వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయి గానీ చేసిన సినిమాలే మూడేళ్లుగా బయటికి రావట్లేదు. ఏదో ఒక్క సినిమా వాయిదా పడిందంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చు.. కానీ కృతి నటించిన సినిమాలన్నీ వరసగా వాయిదా పడుతుంటే ఏమనాలి..? కార్తితో నటించిన అన్నగారు వస్తారు 2024లోనే రావాల్సి ఉన్నా.. వాయిదాల మీద వాయిదాలు పడి మొన్న డిసెంబర్ 12న వస్తుందన్నారు. కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్‌‌తో అన్నగారు ఎంతకీ బయటికి రావట్లేదు. డిసెంబర్ 18న వస్తుందనుకున్న LIK సైతం 2026 ఫిబ్రవరికీ వాయిదా పడింది. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరో. ఇక జ‌యం ర‌వి హీరోగా నటిస్తున్న జీని సైతం రెండేళ్లుగా సెట్స్‌పైనే ఉంది. ఇందులో కృతితో పాటు లోక ఫేమ్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ మరో హీరోయిన్. మొత్తానికి ఈ మూడు ప్రాజెక్ట్స్ బయటికి రాకుండా కృతిని ఇబ్బంది పెడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట్లలో ఇండియన్ యూట్యూబ‌ర్ సంపాదన.. లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాలు.. ఎలాగంటే ??

బోండీ బీచ్‌ హీరోకి విరాళాల వెల్లువ.. రూ.14 కోట్లు పై మాటే

కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్.. సరిగా ఉపయోగించుకుంటే అన్ని బానే ఉంటాయి

కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు.. హడలెత్తిన జనం ఏ చేశారంటే

గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ