Krish Jagarlamudi: ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన క్రిష్‌

Updated on: Sep 02, 2025 | 12:33 PM

వైవిధ్యమైన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. అయితే శాతకర్ణి తర్వాత క్రిష్ తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కంగనా రనౌత్ తెరకెక్కించిన మణికర్ణిక మూవీ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమా విషయంలోనూ మళ్లీ అదే రిపీటైంది.

కొంత భాగం షూటింగ్ పూర్తయ్యక ఈ మూవీ నుంచి బయటకు వచ్చారు క్రిష్. ఇప్పుడు ఘాటి అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులన అలరించేందుకు రెడీ అయ్యాడీ స్టార్ డైరెక్టర్. చింతకింది శ్రీనివాసరావు రాసిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 05న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఘాటీ చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ క్రిష్ తో పాటు నటుడు విక్రమ్‌ ప్రభు, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి హరిహర వీరమల్లు’ సినిమా ప్రస్తావన తీసుకురాగా క్రిష్ అసలు విషయం చెప్పారు. “పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అంటే నాకు ఇష్టం, ప్రేమ. నిర్మాత ఎ.ఎం. రత్నంపై కూడా గౌరవం ఉంది. ఆయన నిర్మించిన సినిమాల పోస్టర్లు చూసి స్ఫూర్తిపొందినవాడిని. ‘హరిహర వీరమల్లు’ని నేను కొంతభాగం చిత్రీకరించాను. కానీ కొవిడ్‌కు తోడు కొన్ని వ్యక్తిగత సమస్య వల్ల ఆ సినిమా షూటింగ్‌ షెడ్యూళ్లలో మార్పులొచ్చాయి. ఆ కారణాల వల్ల నేను ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చా. తర్వాత ఆ సినిమా చిత్రీకరణను జ్యోతికృష్ణ కొనసాగించారు” అని చెప్పుకొచ్చారు క్రిష్. జులై 24న థియేటర్లలో విడుదలైన హరి హర వీరమల్లు సినిమా ఓ మోస్తరుగా ఆడింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఘాటి సినిమా విషయానికి వస్తే.. చైతన్య రావు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, దేవికా ప్రియ దర్శిని, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో ఈసారి నెలముందే ఇంటర్ పరీక్షలు

Donald Trump: కాలు తీసేయాల్సి రావొచ్చు..ట్రంప్ హెల్త్‌పై డాక్టర్ సంచలనం

వీధి శునకాలపై ప్రేమ.. చెంప దెబ్బలకూ వెనకాడని మహిళ

పాపకు కానుకగా బుర్జ్‌ ఖలీఫాలో ఫ్లాట్‌! వైరల్‌గా వీడియో

క్యాంటిన్‌ టీ తాగి.. కుప్పకూలిన మెడికో