ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్
పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ సినిమాలంటూ.. మనం హాలీవుడ్ మీద పడుతుంటే.. హాలీవుడ్ ఏమో.. తమ విజువల్ వండర్ సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ మీద పట్టు సాధిస్తోంది. మన దగ్గర కలెక్షన్సల సునామా సృస్టిస్తోంది. ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా కూడా అదే చేస్తోంది. మన స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాను, వెనక్కి నెట్టి మరీ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హంగామా చేస్తోంది.
ఎప్పటి నుంచో మన ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ పై హాలీవుడ్ సినిమాల దండయాత్ర జరుగుతూనే ఉంది. కానీ గెలిచింది మాత్రం చాలా తక్కువ సార్లు. హాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమా అయితేనో.. లేక మన దగ్గర సినిమాల స్కేర్ సిటీ ఉన్న టైంలోనో… హాలీవుడ్ సినిమా మన దగ్గర బంపర్ హిట్టు కొట్టేది. లేదంటే ఇండియన్ ఇళ్లల్లోని కంప్యూటర్స్‌లో మాత్రమే ఈ సినిమాలు పరితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. డబ్బింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం.. ఇండియాలో తన సినిమాను ప్రమోట్ చేసుకోండంలోనూ హాలీవుడ్ మేకర్స్ ఫోకస్ చేయడం.. ఇండియాన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈసినిమాలకు భారీగా థియేటర్స్ కేటాయించడాన్ని షురూ చేయడంతో.. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ను రాబడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే హాలీవుడ్‌లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా వసూలు చేసింది. రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వంద కోట్ల మార్కెను టచ్ చేసేలా ఉంది. ఎట్ ప్రజెంట్ అమీర్ ఖాన్ సితారే జమీన్ సర్ సినిమా థియేటర్లలో ఉంది. అయితే జనాలు ఈ సినిమాను కాకుండా.. జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమాను చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు థియేటర్స్ ఓనర్స్ చెప్పడం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుత్తాజ్వాల బిడ్డకు పేరు పెట్టిన అమీర్ ఖాన్.. ఒక్క సారిగా ఎమోషనల్ అయిన క్రీడాకారిణి
Kubera: అప్పుడే OTTలోకి కుబేర మూవీ…
మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్