కొత్త సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే..దర్శకుడి కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో మృతి
కేజీఎఫ్ చిత్ర దర్శకుడు కీర్తన్ నాదగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ కొడుకు సోనార్ష్ లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 15న ఈ దుర్ఘటన జరిగింది. ఈ వార్తతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాదగౌడ కొడుకు ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 15న ఈ విషాదం జరిగింది. దీంతో దర్శకుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నారు. కీర్తన్‌కు ధైర్యం చెబుతున్నారు. కీర్తన్ నాదగౌడ కన్నడలో అనేక సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసారు. పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన కేజీఎఫ్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. ఆ అనుభవంతోనే త్వరలోనే డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్‌లో ఓ హారర్ సినిమాను ప్లాన్ చేశారు కీర్తన్ నాదగౌడ. ఇటీవల పూజ కార్యక్రమాలను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. కాగా, కీర్తన్, సమృద్ధి దంపతుల కొడుకు సోనార్ష్ కె.నాదగౌడ ఊహించని విధంగా లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. . ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీరికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి కోరకుంటూ ట్వీట్ చేశారు పవన్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ
Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్.. దుమ్ము దుమారమే
