Rachana Banerjee: ఒకప్పుడు హీరోయిన్‌.. ఇప్పుడు ఎంపీ.. రచన గురించి ఆసక్తికర విషయాలు.

|

Jun 09, 2024 | 2:41 PM

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించిన సినీతారల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. తమ అభిమాన నటులు రాజకీయాల్లో కూడా రాణిస్తే.. వారి ఆనందానికి అవధులుండవు.. వారి ఆనందాన్ని ఒకరినొకరు షేర్‌ చేసుకుంటూ ఉంటారు. దీంతో, సోషల్‌ మీడియాలో పలువురు యాక్టర్ల పేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. వారిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న రచనా బెనర్జీ ఒకరు. అసలు ఎవరీ రచనా బెనర్జీ..

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించిన సినీతారల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. తమ అభిమాన నటులు రాజకీయాల్లో కూడా రాణిస్తే.. వారి ఆనందానికి అవధులుండవు.. వారి ఆనందాన్ని ఒకరినొకరు షేర్‌ చేసుకుంటూ ఉంటారు. దీంతో, సోషల్‌ మీడియాలో పలువురు యాక్టర్ల పేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. వారిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న రచనా బెనర్జీ ఒకరు. అసలు ఎవరీ రచనా బెనర్జీ.. కోల్‌కతాకు చెందిన రచన 1991లో మిస్‌ కోల్‌కతా కిరీటాన్ని అందుకున్నారు. 1992 మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. అప్పట్లో ఆమెను మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమనూ ఆకర్షించింది. అలా 1993లో దాన్‌ ప్రతిదాన్‌ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు. తమిళ్‌, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. రెండో సినిమా ‘కన్యాదానం’తో మంచి గుర్తింపు పొందారు.

1998లో ఆ మూవీతో పాటు రచన నటించిన మరో నాలుగు సినిమాలు విడుదలయ్యాయంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో రచన చివరిగా 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించారు. టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాలలో నటించారు రచన. బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా సత్తా చాటారు. అటు నటిగా, ఇటు యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన ఈ ఏడాదే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె.. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ సాధించారు. తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on