కాంతార ఛాప్టర్ 1 అంచనాలను అందుకుందా..?వీడియో
దసరా సందర్భంగా విడుదలైన మోస్ట్ అవైటెడ్ కాంతార చాప్టర్ 1, తొలి కాంతార విజయం తర్వాత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్, భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ విజయంతో రిషబ్ శెట్టి ఎమోషనల్ అయ్యారు.
దసరా పండుగ సందర్భంగా మోస్ట్ అవైటెడ్ కాంతార చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో, ఈ ప్రీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ చిత్రంగా విడుదలై ప్యాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కాంతారకు ఇది పూర్వకథ. దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కావడంతో కాంతార చాప్టర్ 1 తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే, ముందు ముందు మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
