కాంతార కాంట్రవర్సీ.. చేజేతులా చేసుకున్నాడా

Updated on: Oct 01, 2025 | 6:32 PM

కాంతార సినిమా అనుకోని వివాదంలో ఇరుక్కుంది. దానికి కారణం కూడా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టినే. ఆయన చేసిన పనికి సినిమాపై బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందిప్పుడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ మాటలకు బాగానే హర్ట్ అయ్యారు భాషాభిమానులు. అసలు కాంతారను ముంచేస్తున్న ఆ కాంట్రవర్సీ ఏంటి..? కాంతార ఛాప్టర్ 1పై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి..

కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడలోనే మాట్లాడటం వివాదానికి దారి తీస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి కలెక్షన్లు కావాలి గానీ.. కనీసం ఒక్క ముక్క తెలుగులో మాట్లాడరా.. అంటే మీకేనా భాషాభిమానం ఉన్నది మాకు లేదా అంటూ రిషబ్‌పై భారీగానే విమర్శలొస్తున్నాయిప్పుడు. ఎవరి భాషపై వాళ్లకు అభిమానం, ప్రేమ ఉండటం తప్పు కాదు.. అది వాళ్ల బాధ్యత కూడా. కానీ కాంతార ఛాప్టర్ 1 అనేది రీజినల్ సినిమా కాదు.. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్. అలాంటప్పుడు కచ్చితంగా ఏ ఇండస్ట్రీకి వెళ్తే.. అక్కడి భాషలో కనీసం రెండు ముక్కలు మాట్లాడాలనేది ఆ భాషకు ఇచ్చే కనీస గౌరవం.. కానీ రిషబ్ మాత్రం పూర్తిగా కన్నడలోనే మాట్లాడేసారు. తాను మాట్లాడేది జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్‌లేట్ చేస్తారని చెప్పడం కూడా ఫ్యాన్స్‌కు నచ్చట్లేదు. పైగా ఈ మధ్య కర్ణాటకలో తెలుగు సినిమాల పోస్టర్లు చించేయడాలు, బ్యాన్ చేస్తామని వార్నింగ్స్ ఇచ్చారు భాషాభిమానులు. దాంతో బాయ్‌కాట్ కాంతార అనేది ట్రెండ్ అవుతుంది మన దగ్గర. ఇవన్నీ కాంతార ఛాప్టర్ 1 తెలుగు కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపిస్తాయా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓజి కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?

రాజా సాబ్ ట్రైలర్.. మారుతి మాయాజాలం..!

RFCలో SSMB29 కొత్త షెడ్యూల్

ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్.. అప్పటి వరకు రెస్ట్..!

Balakrishna: మరో క్రేజీ కాంబో సెట్‌ చేస్తున్న బాలయ్య