ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్‌

Updated on: Dec 17, 2025 | 5:00 PM

బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌కు చేరుకుంది. కళ్యాణ్ పడాల, తనుజ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. తొలిరోజు ఓటింగ్‌లో ఊహించని విధంగా కళ్యాణ్ పడాల దూసుకుపోతున్నాడు. గతంలో తనుజ ముందంజలో ఉన్నా, ఇప్పుడు కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నాడు. విన్నర్ ఎవరు అనేది ఈ ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది.

కళ్యాణ్‌ పడాల, తనూజ, డీమాన్ పవన్‌, సంజన, ఇమ్మాన్యుయేల్.. ఈ ఐదుగురూ .. బిగ్ బాస్ సీజన్ 9కి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. అయితే ప్రతి సీజన్ లాగే ఈ సీజన్‌లో కూడా.. రేస్‌లో ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నా కూడా.. ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యే ఉంది. వాళ్లిద్దరే కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి. ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావడం అని ఓటింగ్ బట్టి తెలుస్తోంది. బిగ్ బాస్ విన్నర్‌కి సంబంధించిన ఓటింగ్ లైన్స్ ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే తొలిరోజు ఓటింగ్‌లో ప్రభంజన సృష్టించాడు కామనర్ కళ్యాణ్ పడాల. సాధారణంగా కళ్యాణ్, తనూజ ఈ ఇద్దరూ ఓటింగ్‌లో ఉన్నప్పుడు చాలావరకూ తనూజ లీడింగ్‌లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కళ్యాణ్ ఓటింగ్‌ రేసులో ముందున్నాడు. ఏ ఆన్ లైన్ పోల్ చూసుకున్నా కూడా.. కళ్యాణ్ పడాల టాప్ ఓటింగ్‌తో దూసుకుని పోతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్

Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్

పెద్ది తెలుగు రికార్డులను కొల్లగొట్టిన పవన్ కల్యాణ్

మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు

హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??