NTR మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తారా..?
రాజమౌళి సినిమా తరువాత ఏ హీరో అయినా కాస్త స్లో అవుతారు. కానీ యంగ్ టైగర్ మాత్రం డబుల్ జోష్‌తో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు లైన్‌లో పెడుతూ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. తాజాగా జూనియర్ లైనప్ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతోంది.
రీసెంట్‌గా వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్, ప్రజెంట్ డ్రాగన్ సినిమా వర్క్‌లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెప్టెన్సీలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తారక్ కోసం నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో కథా కథనాలు సిద్ధం చేస్తున్నారు గురూజీ. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ కథతో మూవీ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్, ఎన్టీఆర్‌ను గాడ్ ఆఫ్ వార్‌గా ప్రజెంట్ చేయబోతున్నారు. కథ పరంగానే కాదు మేకింగ్, టేకింగ్, స్కేల్ పరంగానూ ఈ ప్రాజెక్ట్‌ను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్‌కు మైల్ స్టోన్ మూవీ అంటే బాహుబలి మాత్రమే గుర్తుకు వస్తుంది. తారక్ సినిమాతో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రజెంట్ వెంకీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న మాటల మాంత్రికుడు, ప్యారలల్‌గా మైథలాజికల్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కానిచ్చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. మరో ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. షూటింగ్‌కు వెళ్లడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నా… ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనుమానాలకు చెక్ పెడుతూ.. బరిలోకి దిగనున్న వెంకీ..
Trisha: ఇవ్వని నాకు జుజుబీ.. సెటైరికల్ మాటలతో సెట్ చేసి పడేసిందిగా
Alia Bhatt: నెరవేరనున్న అలియా కల.. మరి తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పిస్తారా ??
