Ram Charan: సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్

Updated on: Nov 08, 2025 | 3:29 PM

జానీ మాస్టర్ మెకానిక్‌గా మొదలుపెట్టి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. లైంగిక ఆరోపణలతో డిప్రెషన్‌లోకి వెళ్లినా, రామ్ చరణ్ అండతో మళ్ళీ పుంజుకున్నారు. 'పెద్ది'లోని 'చికిరి' పాటతో తిరిగి ఫామ్‌లోకి వచ్చి, తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. కష్టకాలంలో చరణ్ చూపిన మద్దతు సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది.

జానీ మాస్టర్! మెకానిక్‌గా బైకులు రిపేర్ చేసుకునే స్టేజ్‌ నుంచి స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసే స్థాయి వరకు ఎదిగాడు. తన ట్యాలెంట్‌తో పాన్ ఇండియాలోనే ట్యాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్‌గా నామ్ కమాయించాడు. కానీ ఉన్నట్టుండి తన పై వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా సైలెంట్ అయిపోయాడు. చేతికి వచ్చిన నేషనల్ అవార్డ్‌ జారిపోవడం.. చుట్టూ ఉన్నవాళ్లు నేరస్తుడిలా చూడడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అయితే అలాగే డిప్రెషన్లోనే మగ్గిపోకుండా జానీ మాస్టర్ మళ్లీ బౌన్స్‌ బ్యాక్ అయ్యాడు. పాన్ ఇండియా సినిమాల్లోని పాటకు కొరియోగ్రఫీ చేస్తూ.. మళ్లీ తన హవా చూపిస్తున్నాడు. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ పెద్ది సినిమాలోని చికిరి పాటకు కూడా జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేశాడు. దీంతో ఈ స్టార్ కొరియోగ్రాఫర్ పేరు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందులోనూ ఇలాంటి టైంలో చరణ్‌ జానీ వెన్నంటే నిలవడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ టాపిక్ గా మారింది. చిరు వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌ చరణ్‌ తనకంటూ స్టార్ ఇమేజ్‌ ను క్రియేట్‌ చేసుకోవడమే కాదు.. ట్యాలెంట్‌ ఉన్న చాలా మందిని ఇండస్ట్రీలో ఎంకరేజ్‌ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢీలో డ్యాన్స్ మాస్టర్‌గా రాణిస్తున్న జానీ మాస్టర్‌ ట్యాలెంట్‌ను గుర్తించిన చరణ్‌.. పిలిచి మరీ సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. అలా జానీ కెరీర్‌లో పెద్ద రోల్‌ను పోషించాడు. ఇక అనుకోకుండా లైగింక ఆరోపణల కారణంగా జానీ మాస్టర్ కెరీర్‌ డల్‌ అయిపోయింది. సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సివన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే బౌన్స్‌ బ్యాక్ అవుతున్న జానీ మాస్టర్‌కు చరణ్ మరో సారి మంచి అవకాశం ఇచ్చాడు. బుచ్చిబాబు డైరెక్షనలో తాను చేస్తున్న పెద్ది సినిమాలో.. చికిరి సాంగ్‌కు కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చాడు. రీసెంట్‌గా ఈ సాంగ్‌ కూడా బయటికి వచ్చింది. ఇందులో చరణ్ చేత జానీ మాస్టర్ చేయించిన హుక్‌ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి జానీ మాస్టర్ పేరు తెలుగు స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే జానీ మాస్టర్‌కు మరో సారి అవకాశం ఇవ్వడంపై చరణ్‌ను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??

The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?

Jr NTR: సన్నగా కాదు.. సైలెంట్‌గా దిగే బాకు

Jatadhara: కథగా ఓకే కానీ.. హిట్టా..? ఫట్టా..?

Bigg Boss Telugu 9: తారుమారైన ఓటింగ్.. ఊహించని కంటెస్టెంట్‌ డేంజర్‌ జోన్‌లో

Published on: Nov 08, 2025 03:29 PM