Jana Nayagan: ఓడి గెలిచిన హీరో.. ఎట్టకేలకు జననాయగన్‌కు లైన్ క్లియర్
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి 'జన నాయగన్' సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి. మద్రాస్ హైకోర్టు చిత్ర నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది, U/A 16+ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. దీంతో విజయ్ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ చిత్రానికి అడ్డంకులు తొలగిపోయాయి. మద్రాస్ హైకోర్టు నుంచి ఈ మూవీ ప్రొడ్యూసర్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికేట్ జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మద్రాస్ హైకోర్ట్. ఇక హైకోర్టు తీర్పుతో.. విజయ్ చివరి సినిమా అయిన జన నాయగన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లైంది. అయితే హైకోర్టు తుది తీర్పు తర్వాత ప్రొడ్యూసర్స్ ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ కోలీవుడ్‌లో జన నాయగన్ రిలీజ్ పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావచ్చని దాన్ని బట్టి తెలుస్తోంది. వాస్తవానికి జన నాయగన్ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ కారణంగా ఈ మూవీని వాయిదా వేశారు. ఈ విషయాన్ని బుధవారం చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా కంట్రోల్ లో లేని అనూహ్య పరిస్థితుల కారణంగానే తమ సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వస్తుందని తెలిపింది. ఈక్రమంలోనే ఈ సినిమాకు వెంటనే యుఎ సర్టిఫికేట్ జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు సిబిఎఫ్‌సిని ఆదేశించింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. తమ హీరో ఓడి గెలిచాడంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Netflix: నెట్ ఫ్లిక్స్ సైట్ క్రాష్.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ
Mamitha Baiju: మమితమ్మ దెబ్బకు.. జన నాయగన్ పై ట్రోల్స్
The Raja Saab Review: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే! రాజాసాబ్
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్ విజ్ఞప్తి
