The Raja Saab: పుష్ప2 Vs ధురంధర్‌.. మరి ది రాజాసాబ్‌ టార్గెట్‌ ఎవరు ??

Edited By:

Updated on: Jan 06, 2026 | 4:16 PM

జనవరి 9న 'రాజాసాబ్‌' విడుదల కానుండటంతో, హిందీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల యుద్ధం మొదలవనుంది. ప్రస్తుతం 'పుష్ప 2' పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును 'ధురంధర్‌' దాటే ప్రయత్నంలో ఉంది. 'రాజాసాబ్‌' ఎంట్రీతో కలెక్షన్లు మరింత చీలి, పోటీ తీవ్రం కానుంది. ఐకాన్ స్టార్ రికార్డులను 'రాజాసాబ్‌' అధిగమిస్తుందా, లేదా కొత్త ఫైట్ మొదలవుతుందా అనేది జనవరి 9న తేలిపోతుంది.

జనవరి 9కి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్‌ని మిస్‌ చేసుకున్న రాజాసాబ్‌ ఈ ఏడాది ఎన్ని రికార్డులను కొల్లగొడతారో చూడాలని చాలా మంది ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే వాటన్నిటికీ బాప్‌లా ఉంది హిందీ సిట్చువేషన్‌. ఆల్రెడీ ఇప్పటిదాకా హిందీలో ఆల్‌ టైమ్‌ రికార్డు మన ఐకాన్ స్టార్‌ పేరు మీదే ఉంది. ఇప్పుడు రాజాసాబ్‌ క్రాస్‌ చేయాల్సింది ఈ మార్కునేనా? ఇంకేదైనా ఉందా? కమాన్‌ లెట్స్ డిస్కస్‌… ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మనం ఢంకా భజాయించడం వేరు. నార్త్ వీధుల్లో మన జెండా పాతడం వేరు. అలాంటి రేర్‌ ఫీట్‌ని అచీవ్‌ చేసింది పుష్ప2. హిందీలో ఆల్‌ టైమ్‌ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు దీన్ని దాటడానికే రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సలు తగ్గేదేలే మేనరిజంతో ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉంది పుష్ప2. వారం రోజులు.. రెండు వారాలు థియేటర్లలో మూవీస్‌ ఆడటం కష్టమైపోతున్న ఈ తరుణంలో ఐదో వారం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ధురంధర్‌. 800 ప్లస్‌ వసూళ్లతో దూసుకుపోతోందీ సినిమా. అతి త్వరలోనే పుష్ప2 హిందీ రికార్డులను కొల్లగొడుతుందనే ఎదురుచూపులు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ధురంధర్‌కి అది సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా మరోవైపు మొదలయ్యాయి. ఆల్రెడీ నార్త్ బెల్ట్ లో ఇక్కీస్‌ మూవీకి మంచి స్పందన ఉంది. సో, కలెక్షన్లు అటుగా డివైడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఈ నెల 9 నుంచి ది రాజాసాబ్‌ స్వారీ మొదలవుతుంది. వీటన్నిటిని తట్టుకుని పుష్ప2 మార్క్ ని క్రాస్‌ చేయాలి ధురంధర్‌. ఒకవేళ క్రాస్‌ చేస్తే మాత్రం ధురంధర్‌ రికార్డులే ది రాజాసాబ్‌కి టార్గెట్‌. ఒకవేళ తడబడితే మాత్రం హిందీ బాక్సాఫీస్‌ దగ్గర మన హీరోల మధ్య ఫైట్‌ మొదలైనట్టే. అయితే ఐకాన్‌స్టార్‌, లేకుంటే రణ్‌వీర్‌ సింగ్‌ రికార్డుల్ని టార్గెట్‌ చేయాల్సిన సిట్చువేషన్‌ ఉంది రాజాసాబ్‌కి. పక్కా టార్గెట్‌ ఎవరు, ఏంటన్నది జనవరి 9న డిసైడ్‌ అవుతారు డార్లింగ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతికి సక్సెస్ కావాలంటున్న హీరోయిన్లు ఎవరెవరు

తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

Ram Charan: రామ్‌ చరణ్‌కు కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి అడ్డుగా అమీర్ ఖాన్

అప్పుడు భర్త.. రీసెంట్‌గా భార్య.. సందీప్‌కు దెబ్బ మీద దెబ్బ.. అయినా హిట్ కొట్టాడు