చిన్నోడనుకునేరు.. మనోడు మహా రసికుడు..

Updated on: Jul 19, 2025 | 6:22 PM

పొట్టి నరేష్.. ఈ పేరుతో జబర్దస్త్‌లో కమెడియన్‌గా తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకున్నాడు. తన ఫిజికల్ అప్పియరెన్స్ నే.. తన కెరీర్‌కు బలంగా మార్చుకున్నాడు. తన పంచులతో.. అందర్నీ కడుపుబ్బా నవ్విస్తూ.. రెండు చేతులా సంపాదించే స్థితికి వచ్చాడు. అంతేకాదు షోలో.. ఓ బ్యూటీతో లవ్ నడిపి.. తన పటాయించే మాటలతో.. రొమాంటిక్ వేషాలతో.. ఏకంగా మహా రసికుడనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు.

అయితే ఈ కామెంట్‌ వెనక ఉన్న అసలు మ్యాటర్‌ను.. తన లవ్‌ ట్రాక్ వెనక ఉన్న స్టోరీని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ చిన్నోడు. ఇక స్ట్రెయిట్‌గా విషయంలోకి వెళితే.. సీరియల్ నటి షబీనా షేక్ తో.. జబర్దస్త్‌లో లవ్ ట్రాక్ నడిపాడు నరేష్. స్టేజ్ పై ఆమెను పడేయడానికి నానా ప్రయత్నాలు చేసి ప్రేక్షకులకు నవ్వించేవాడు. ఆమె చుట్టే తిరిగేవాడు. తోటి కంటెస్టెంట్స్‌ కూడా వీరిద్దనీ లవర్స్‌ గానే కామెంట్స్ చేసేవారు. వాళ్ల స్కిట్స్‌లో వీరిద్దరి ఎఫైర్ పై పంచ్ లు వేసేవారు. దీంతో ఈ ఇద్దరూ నిజంగా లవ్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలేనే నబీనా రీసెంట్గా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో నబీనా నరేష్‌కు హ్యాండిచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపించాయి. కట్ చేస్తే.. దీనిపై నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడు.. తనది రియల్ లవ్‌ కాదని.. స్కిట్‌ లవ్ అంటూ రివీల్ చేశాడు.తమ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రోజా అని షాకింగ్ విషయం చెప్పాడు. అది కేవలం స్టేజ్ వరకే అన్నాడు. ఇక షబీనా తనను పెళ్ళికి పిలిచిందని.. కానీ పెళ్లి గుంటూరు లో కావడంతో తాను వెళ్ళలేకపోయానంటూ చెప్పాడు.పెళ్ళికి వెళ్తే తనను చూసి పీటల మీద నుంచి వచ్చేసేదేమో.. అంటూ సరదాగా అన్నాడు నరేష్. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ జబర్దస్త్ నరేష్. ఇంకో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తనకు అందంగా.. మోడ్రన్ గా ఉన్న అమ్మాయిలే కావాలనే రూల్ లేదని.. తన తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలన్నాడు. అలాగే ఇండస్ట్రీ అమ్మాయి అయినా.. బయట అమ్మాయి అయినా తనకు పర్లేదని చెప్పుకొచ్చాడు ఈ చోటా కమెడియన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!

సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు

పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్

ఫేక్ రివ్యూ ఎఫెక్ట్ పోలీస్‌ స్టేషన్‌కు పూల చొక్కా…

రూ. 7 కోట్లతో తీస్తే.. 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్