హమ్మయ్య గండం గడిచింది.. ఇక అతను సేఫ్‌ !!

హమ్మయ్య గండం గడిచింది.. ఇక అతను సేఫ్‌ !!

Phani CH

|

Updated on: Sep 13, 2023 | 9:47 AM

ఓ పక్క నవ్విస్తూనే.. ఇంకో పక్క తన ప్రాణాల కోసం ఇంతకాలం పోరాటం చేసిన జబర్దస్త్‌ పంచ్‌ ప్రసాద్.. ఎట్టకేలకు ఆ పోరాటంలో విజయం సాధించారు. మునుపటిలా.. తన సిల్లీ పంచులతో.. మిమ్మల్ని కడుప్పుబ్బా నవ్వించడం ఖాయం అంటూ.. ఎమోషనల్ అయ్యారు. మరో సారి తన సిల్లీ మాటలతో.. అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఎస్ ! గత కొంతకాలంగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్న పంచ్‌ ప్రసాద్.. డయాలసిస్‌ చేయించుకుంటూనే జబర్దస్త్ షోలు చేసేవారు. ఆ షోల్లో కూడా తన ఆరోగ్య పరిస్థితిపై.. తన కిడ్నీ ఫెయిల్‌పై జోకులు పెలుస్తూనే.. ఉండేవారు. అలా అందర్నీ నవ్విస్తూనే ఎమోషనల్ అయ్యేలా కూడా చేసేవారు.

ఓ పక్క నవ్విస్తూనే.. ఇంకో పక్క తన ప్రాణాల కోసం ఇంతకాలం పోరాటం చేసిన జబర్దస్త్‌ పంచ్‌ ప్రసాద్.. ఎట్టకేలకు ఆ పోరాటంలో విజయం సాధించారు. మునుపటిలా.. తన సిల్లీ పంచులతో.. మిమ్మల్ని కడుప్పుబ్బా నవ్వించడం ఖాయం అంటూ.. ఎమోషనల్ అయ్యారు. మరో సారి తన సిల్లీ మాటలతో.. అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఎస్ ! గత కొంతకాలంగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్న పంచ్‌ ప్రసాద్.. డయాలసిస్‌ చేయించుకుంటూనే జబర్దస్త్ షోలు చేసేవారు. ఆ షోల్లో కూడా తన ఆరోగ్య పరిస్థితిపై.. తన కిడ్నీ ఫెయిల్‌పై జోకులు పెలుస్తూనే.. ఉండేవారు. అలా అందర్నీ నవ్విస్తూనే ఎమోషనల్ అయ్యేలా కూడా చేసేవారు. ఇక ఈక్రమంలోనే ఇటీవల పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్ చేస్తే కానీ బతకలేని పరిస్థితి వచ్చింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డబ్బు లేకపోవడంతో.. ధాతల కోసం మీడియా వరకు ఆయన్ను ఎక్కించింది. ఇక ఈ క్రమంలోనే అప్పట్లో జబర్దస్త్‌ జడ్జ్‌ గా కొనసాగిన రోజా.. జగన్ ప్రభుత్వంతో మాట్లాడి.. పంచ్‌ ప్రసాద్‌కు సీఎం రిలీజ్ ఫండ్ ఇప్పించారట. కిడ్నీ డోనర్ కూడా దొరకడంతో.. తాజాగా ఈ కమెడియన్‌కి సక్సెస్‌ ఫుల్‌గా కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. ఇదే విషయాన్ని చెబుతూ.. తాజాగా ఈ కమెడియన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఏపీ ప్రభుత్వంతో పాటే.. రోజాకు.. తన జబర్దస్త్ ఫ్యామిలీకి, తన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. దాంతో పాటే అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో మళ్లీ నవ్వుల జర్నీ స్టార్ట్ చేస్తానంటూ.. చెప్పుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్‌ తెలిస్తే గుండె ఆగిపోద్ది..

అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌