Polimera 2 Review: హిట్టా..? ఫట్టా..? ఇంట్రెస్టింగ్ అండ్ హారర్ మూవీ పొలిమేర 2 రివ్యూ.

|

Nov 04, 2023 | 9:44 AM

పొలిమేర1కు సీక్వెల్‌గా తెరకెక్కిన.. పొలిమేర2 సినిమాపై.. తెలుగు ఆడియెన్స్‌లో విపరీతంగానే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే.. రిలీజ్‌ చేసేందుకు థియేటర్లు కూడా భారీగానే దక్కాయి. మరి అలాంటి ఈ సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్‌ అయ్యేలానే ఉందా..? అనేది తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ.. కొమ్రు అలియాస్ సత్యం రాజేష్ ఊరి నుంచి పారిపోయి కేరళలో ఉంటాడు. మరోవైపు కొమ్రు తమ్ముడు జంగయ్య అలియాస్ బాలాదిత్య కనిపించకుండా పోతాడు.

పొలిమేర1కు సీక్వెల్‌గా తెరకెక్కిన… పొలిమేర2 సినిమాపై.. తెలుగు ఆడియెన్స్‌లో విపరీతంగానే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే.. రిలీజ్‌ చేసేందుకు థియేటర్లు కూడా భారీగానే దక్కాయి. మరి అలాంటి ఈ సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్‌ అయ్యేలానే ఉందా..? అనేది తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ.. కొమ్రు అలియాస్ సత్యం రాజేష్ ఊరి నుంచి పారిపోయి కేరళలో ఉంటాడు. మరోవైపు కొమ్రు తమ్ముడు జంగయ్య అలియాస్ బాలాదిత్య కనిపించకుండా పోతాడు. లక్ష్మి అలియాస్ కామాక్షి ఊళ్లో తన కొడుకుతో కలిసి బతుకుతుంటుంది. అదే సమయంలో ఊళ్లో సర్పంచులు వరసగా గుడిలోనికి వెళ్లి చనిపోతూ ఉంటారు. సరిగ్గా ఆ టైమ్‌లోనే ఊరికి కొత్తగా ఎస్సై అలియాస్ రాకెందుమౌళి వస్తాడు. వచ్చీ రాగానే కొమ్రు తమ్ముడు జంగయ్య మిస్సింగ్ కేసుపై ఫోకస్ పెడతాడు. ఆ క్రమంలోనే జంగయ్య గురించి కాకుండా.. కొమ్రు గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. మరోవైపు మాల వేసుకున్న కారణంగా శబరికి వెళ్లిన బలిజ అలియాస్ గెటప్ శ్రీను.. అక్కడే కొమ్రును చూస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది..? ఊరంతా చనిపోయాడనుకుంటున్న కొమ్రు కేరళలో ఏం చేస్తున్నాడు.. ఊళ్లోని సర్పంచుల వరుస చావులకు.. కొమ్రు తమ్ముడు జంగ్గయ్య మిస్సింగ్‌కు .. కొమ్రుకు ఏదైనా లింక్ ఉందా అనేది మితగా సినిమా..

కరోనా టైంలో.. చేతబడులు.. ఊరి పొలిమేరలు.. అంటూ… అందర్నీ విపరీతంగా థ్రిల్ అయ్యేలా చేసిన సినిమా మా ఊరి పొలిమేర. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమా..ఆ సినిమా ఎక్కడైతే ముగుస్తుందో.. అక్కడి నుంచి మొదలవుతుంది. పొలిమేర1 స్టోరీని… ఎక్టెండ్ చేసి పొలిమేర 2 ను ఇంట్రెస్టింగ్‌గా మలచడంతో.. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్‌ సక్సెస్ అయ్యారు. తను అనుకున్నట్టే.. జనాలు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే.. పొలిమేర 2లో సీన్లన్నీ రాసుకున్నాడు. చేబబడులు.. వారి చుట్టూ తిరిగే పాత్రలతో.. సినిమాను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రీన్ ప్లే లో మాత్రం.. కాస్త తడబడ్డారు. మాటి మాటికి ప్లాఫ్ బ్యాక్ ఎపిసోడ్స్‌ చూపిస్తూ.. కొంత మంది ప్రేక్షకులను కన్పూజ్ చేసేశారు. కానీ పొలిమేర 2 ఫస్ట్ ఆఫ్ తో.. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్‌ తో.. ప్రేక్షకులను ఓ రేంజ్లో ఎంగేజ్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక సెకండ్ ఆఫ్‌లోనూ.. ట్విస్టుల మీద ట్విస్టులు గుమ్మరించి.. సినిమాను ముగించాడు. సత్యం రాజేష్ మరోసారి అదరగొట్టాడు. ఆ పాత్ర కోసమే పుట్టాడేమో అనిపిస్తుంది. దానికితోడు ఆయన హావభావాలు కూడా భయపెడతాయి. కామాక్షి భాస్కర్ల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లక్ష్మి పాత్రలో ఆమె చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో గెటప్ శ్రీను అద్భుతంగా నటించాడు. బాలాదిత్య సీక్వెల్‌లో కనిపించే సన్నివేశాలు తక్కువే. ఇక కీలకమైన ఎస్సై పాత్రలో రాకెందుమౌళి ఆకట్టుకున్నాడు. వీరి పర్ఫార్మెన్స్‌కు తోడు… జ్ఞాని అందించిన సంగీతం.. బీజీఎమ్‌ సినిమాకు ప్రాణం పోసింది. రిమైనింగ్ డిపార్ట్‌మెంట్స్‌ కూడా.. చాలా బాగా పని చేశాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.