ఆపరేషన్ సింధూర్‌ !! భారత ఆర్మీకి జేజేలు కొట్టిన మన హీరోలు

Updated on: May 08, 2025 | 7:07 PM

పహల్గాం ఉగ్రదాడికి.. బదులు తీర్చుకోవాడాన్ని మొదలెట్టింది భారత్‌. తెల్లారక ముందే.. ఉగ్రమూకల స్థావరాలపై మిసైల్స్‌తో భీకరంగా దాడి చేసింది. ఉగ్ర స్థావరాలను నేల మట్టం చేయడమే ఉగ్రవాదుల ప్రాణాలను పైకి పంపడాన్నే టార్గెట్ గా పెట్టుకుంది. మన మహిళల నుదుటున సింధూరాన్ని తుడిచిన ముష్కరుల రక్తాన్ని కల్ల చూస్తోంది.

ఇందుకోసం ఆపరేషన్ సింధూర్‌ అని నామకరణం చేసింది. ఈ పేరే ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇండియన్ ఆర్మీకి .. జేజేలు కొట్టేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా.. ఈ ఆపరేషన్‌ పై స్పందించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఎమోషనల్‌గా పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ ఫోటోను తన ఎక్స్‌ హ్యాండిల్లో షేర్ చేసిన అల్లు అర్జున్, మే జస్టిస్ బీ సర్వ్‌డ్‌. జై హింద్‌ అంటూ.. ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. తన పోస్ట్‌కు హ్యాష్‌ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్‌ను జోడించాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇండియన్ ఆర్మీ సేఫ్‌గా.. స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకున్నారు. జై హింద్‌ అంటూ.. తన ట్విట్టర్ హ్యాండిల్లో కోట్ చేశాడు. మెగాస్టార్ చిరు ఆపరేషన్‌ సింధూర్ ఫోటోను షేర్ చేసి.. జై హింద్ అంటూ కోట్ చేశారు. తన ఎక్స్‌ పోస్ట్‌కు ఇండియన్ ఫ్లాగ్ ఎమోజీని యాడ్ చేశారు. వీరితో పాటు విజయ్‌ దేవరకొండ, విశ్వక్, గోపీచంద్ మలినేని, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్ తేజ్‌, కళ్యాణ్ రామ్ కూడా జై హింద్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంది మామా ఇది !! షారుఖ్ వాచ్ ఖరీదు అక్షరాల రూ.21 కోట్లా ??

నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్‌ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్‌ !!

సన్యాసినిగా మారిన టాలీవుడ్ హీరోయిన్

యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!

షాకింగ్ న్యూస్ ! ఛావాను మిస్ చేసుకున్న మహేష్‌ బాబు