రవిని అంతా రాబిన్ హుడ్ లా చూస్తున్నారు.. కానీ..వీడియో
ఐబొమ్మ రవిని ప్రజలు రాబిన్ హుడ్‌లా చూస్తున్నారని సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు అన్నారు. రవి కేసులో న్యాయ సలహా ఇవ్వడం వెనుక గల కారణాలను ఆయన వివరించారు. టాలీవుడ్ లోని అంతర్గత సమస్యలు, పైరసీ నష్టాలపై ఆధారాలు లేమి వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం రవి కస్టడీ విచారణ, బెయిల్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఐబొమ్మ రవి అరెస్టు, టాలీవుడ్ పైరసీ కేసుపై సీనియర్ అడ్వకేట్ సీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ రవిని ప్రజలు రాబిన్ హుడ్‌లా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినిమాల్లో మాదిరిగా ఒకరు పుట్టుకొస్తారని, అలాంటి వ్యక్తే ఐ బొమ్మ రవి అని నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తాను న్యాయ సలహా మాత్రమే ఇవ్వాలనుకున్నానని, అడ్వకేట్‌గా ఉన్నానని ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కసబ్ వంటి వారికి కూడా న్యాయ సహాయం అందిందని, రాజ్యాంగం ప్రకారం ఇది ప్రతి ఒక్కరి హక్కు అని ఆయన ఉద్ఘాటించారు. సినీ పరిశ్రమలో కార్మికుల అగ్రిమెంట్ల సమస్యలు, అధిక ఖర్చుల వల్ల సినిమా ప్రేక్షకుల నుండి దూరం అవుతోందని నరసింహారావు విమర్శించారు.
మరిన్ని వీడియోల కోసం :
