ఐ బొమ్మ రవి.. లైఫ్‌ స్టైల్‌ ఇదే !! డబ్బు సంపాదన అంటే ఎందుకంత కసి ??

Updated on: Nov 20, 2025 | 1:24 PM

పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి పైరసీ సామ్రాజ్యం నిర్మించాడు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌ల ద్వారా కోట్ల సంపాదించాడు. 50 లక్షల మంది డేటాను సైబర్ నేరస్థులకు విక్రయించి రూ.20 కోట్లు పోగేసుకున్నాడు. భారత పౌరసత్వం వదులుకుని విదేశాల్లో స్థిరపడాలనుకున్న రవి కథలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకే సవాల్‌ విసిరి, ఊచలు లెక్కిస్తున్నాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాలేజీ డేస్‌ నుంచి పెళ్లి వరకు తనకు జరిగిన అవమానాలతో డబ్బు సంపాదనే లక్ష్యంగా అడుగేశాడు. 2016లో ఒక యువతిని ప్రేమించి పెళ్లాడాడు. ఇగో ఇష్యూసో..మనీ మ్యాటర్సో కారణాలేవైనా పెళ్లి బంధం బీటలు వారింది. సోలో బతుకే సో బెటరంటూ ఏక్‌ నిరంజన్‌లా మారాడంటున్నారు పోలీసులు. నెలకు లక్ష జీతం వచ్చే సాఫ్ట్‌వేర్‌ కొలువు కన్నా పదిరెట్ల ఆమ్‌దానీ వస్తుందని ఇస్మార్ట్‌గా పైరసీలో మాస్టరయ్యాడు. వెబ్‌ డిజైనర్‌గా తనకున్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లకు రూపమిచ్చాడు. కొన్ని నెలలకే బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావటంతో ఊహించనంత డబ్బు వచ్చింది. అనంతరం మకాంను నెదర్లాండ్స్‌ కు మార్చాడు. తాను ఎక్కడున్నా అక్కడి నుంచే వెబ్‌సైట్లను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాటి ద్వారా సేకరించిన 50 లక్షల మంది డేటాను సైబర్‌ నేరస్థులు, గేమింగ్‌ ముఠాలకు విక్రయించి రూ.20 కోట్లు సంపాదించాడు. కూకట్‌పల్లిలోని ఫ్లాట్‌ను విక్రయించి.. వచ్చిన సొమ్ముతో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో ఉండగానే పోలీసులకు చిక్కాడు. ఫ్యామిలీ బాధ్యతల్లేవ్‌… ఫ్రెండ్స్‌ మస్తీకలందర్‌ జల్సాల్లేవు. కానీ డబ్బంటే మహా ఇష్టం. దేశాలు పట్టుకు తిరగడం నాట్‌ జస్ట్‌ యాన్‌ ఎంజాయిమెంట్‌. అదే అతని మనీ రిసోర్స్‌. అందుకోసం భారత్‌ పౌరసత్వాన్ని వదలుకొని కరేబియన్‌ సిటిషన్‌ షిప్‌ తీసుకున్నాడు. పట్టుకోండి చూద్దాం అని సవాల్‌ విసరడమే కాదు. అరెస్ట్‌ చేస్తే తనకు పోయేదేమిలేదని ఫిక్సయ్యాడట. ఇప్పటికైతే ఐబొమ్మ రవి పేరిట 35 అకౌంట్లు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. వాటిలో నాలుగు ఖాతాల్లో 20 కోట్లు గుర్తించారు. ఓ అకౌంట్‌లో 3 కోట్లు ఫ్రిజ్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్‌ మేట్‌

TOP 9 ET News: మహేష్ 100 కోట్లు.. జక్కన్న 200 కోట్లు | ‘వారణాసి’ నుంచి సాంగ్ రిలీజ్‌

మాటలతోనే ట్రోలర్స్‌ను చావుదెబ్బ కొట్టిన ఆది

‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్

బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్