అప్‌డేట్స్ లేకుండానే హైప్ పెంచుతున్న సినిమాలు వీడియో
సినిమాల ప్రచారం విషయంలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ బజ్ పెంచేవారు. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఎలాంటి అప్‌డేట్స్ లేకపోయినా భారీ అంచనాలు, క్రేజ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ కొత్త ఫార్ములాను సినీ మేకర్స్ అనుసరిస్తున్నారు.
సినిమాపై అంచనాలను పెంచాలంటే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు అభిమానులను ఎంగేజ్ చేస్తూ అప్‌డేట్స్ అందించడం పాత పద్ధతి. అయితే, ప్రస్తుత జనరేషన్ మేకర్స్ సినిమా ప్రమోషన్ ఫార్ములాను పూర్తిగా మార్చేశారు. అప్‌డేట్స్ లేకుండానే సినిమాలపై హైప్ పెంచుతూ అభిమానులలో ఆసక్తిని నిలుపుకుంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబల్ మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నా, ఇప్పటివరకు ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. అయినప్పటికీ, ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎస్ఎస్ఎంబి 29 అనే తాత్కాలిక పేరుతో బజ్ క్రియేట్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
