సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్‌ అవుతున్న జోడీలు.. మళ్లీ కుదురుతున్నట్టేనా ??

Edited By: Phani CH

Updated on: Nov 20, 2025 | 3:37 PM

బాలయ్య-నయనతార జంట నుండి ప్రేరణ పొంది, సౌత్ ఇండియన్ సినిమా మళ్ళీ స్టార్ హీరో హీరోయిన్ల రిపీటెడ్ జోడీలపై దృష్టి పెట్టింది. ధనుష్-సాయిపల్లవి, విజయ్-పూజా హెగ్డే, శివకార్తికేయన్-శ్రీలీల, ప్రభాస్-అనుష్క వంటి హిట్ జంటలు రాబోయే సినిమాలలో మరోసారి సందడి చేయనున్నాయి. ఈ ట్రెండ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.

బాలయ్య – నయనతార టాపిక్‌ ఇలా ఫ్లాష్‌ అయిందో లేదో… ఇప్పడు సెట్స్ మీదున్న, టాక్స్ లో ఉన్న రిపీటెడ్‌ జంటల మీద ఫోకస్‌ గట్టిగా పెరిగింది. నయన్‌ మాత్రమే కాదు, అనుష్క, సాయిపల్లవి, పూజా హెగ్డే, శ్రీలీల.. ఇలా చాలా మంది ఈ మోడ్ లోనే ఉన్నారు. నార్త్ రామాయణంలో బిజీగా ఉన్న సాయిపల్లవి త్వరలోనే ధనుష్‌తో జోడీ కట్టబోతున్నారనే వార్త కోలీవుడ్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆల్రెడీ మారి2లో సూపర్‌హిట్‌ జోడీ అనిపించుకున్నారు ధనుష్‌ అండ్‌ పల్లవి. ఇప్పుడు రాజ్‌ఖుమార్‌ పెరియసామితో ధనుష్‌ చేసే సినిమాలోనూ పల్లవిని సెలక్ట్ చేసినట్టు సమాచారం. సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే జననాయగన్‌లో విజయ్‌ తో నటిస్తున్నారు పూజా. ఆల్రెడీ తమిళ్‌బీస్ట్ లో వీరిజంటకు మంచి మార్కులు పడ్డాయి. తమిళనాడులో నయా సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంటున్నారు శ్రీలీల. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్‌ సరసన పరాశక్తిలో నటిస్తున్నారు. ఈ మూవీకి నెక్స్ట్ శివ కార్తికేయన్‌ చేసే సినిమాలోనూ శ్రీలీలనే నాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. టాలీవుడ్‌ మోస్ట్ ఫేవరేట్‌ జోడీ ప్రభాస్‌ అండ్‌ అనుష్క కూడా త్వరలోనే కల్కి2 సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. రష్మిక, విజయ్‌ దేవరకొండ జంట కూడా థియేటర్లలో విజిల్స్ మోత మోగించడానికి రెడీ అవుతున్నారన్న మాట ఎప్పటి నుంచో ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: సింహా జోడీకి సూపర్‌క్రేజ్‌.. మహారాణి వచ్చేస్తున్నారహో

పాన్ ఇండియా డైరెక్టర్లు.. పక్కా లోకల్‌ సినిమాలు చేసేదెప్పుడు

పాక్‌ ఉగ్ర కుట్రలు.. బిర్యానీ,దావత్ కోడ్ తో..

ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకెళ్లినకారు.. ఆ తర్వాత..

IPL 2026: ఐపీఎల్ 2026 వేలం ముహూర్తం ఫిక్స్..

Published on: Nov 20, 2025 03:37 PM