Rashmika Mandanna: అయ్యో.. రష్మికకు ఏమైంది? వీల్‌ ఛైర్‌లో ఇలా..

Updated on: Jan 23, 2025 | 3:15 PM

స్టార్‌ హీరోయిన్ రష్మిక నేషనల్‌ క్రష్‌ అయిపోయింది. పుష్ప2 హిట్‌తో రష్మిక రేంజ్‌ వీర లెవల్‌లో పెరిగిపోయింది. అయితే రష్మిక ఇటీవల గాయపడింది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె కాలికి గాయమైంది. తాజాగా ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తన హిందీ చిత్రం ప్రచారంలో పాల్గొనడం కోసం ముంబయి బయల్దేరినట్లు తెలుస్తోంది. కారులో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రష్మిక తన టీమ్‌ సాయంతో వీల్‌ఛైర్‌లో విమానాశ్రయం లోపలికి వెళ్లారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. తనకు గాయమైనట్లు తెలుపుతూ ఇటీవల రష్మిక ఓ పోస్ట్‌ పెట్టారు. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని సికందర్‌, థామ, కుబేర సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా. ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్‌ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా అని పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం రష్మిక ‘ఛావా’సినిమాతో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన హిస్టారికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఇది. తెలుగులో కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్‌, రెయిన్‌ బో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుష్ప-2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్‌

Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో సోదాలు

డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష

ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు

లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి