Ananya Pandey: వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!

Ananya Pandey: వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!

Anil kumar poka

|

Updated on: Oct 15, 2024 | 4:36 PM

ఇండస్ట్రీలో ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. బీటౌన్ సీనియర్ నటుడు చుంకీ పాండే ముద్దుల కూతురే ఈ బ్యూటీ. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో ఇటు దక్షిణాది అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అనన్యకు అంతగా అవకాశాలు రాలేదు.

ఇండస్ట్రీలో ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. బీటౌన్ సీనియర్ నటుడు చుంకీ పాండే ముద్దుల కూతురే ఈ బ్యూటీ. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో ఇటు దక్షిణాది అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అనన్యకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తోన్న ఈ బ్యూటీ తాజాగా ఓ స్టార్ హీరో కుమారుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

అసలు విషయానికి వస్తే.. అనన్య పాండే, షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ చిన్ననాటి స్నేహితులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య.. తన చిన్నతనంలో ఆర్యన్ తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. రోజంతా తానేం చేస్తాను.. ఏం తింటాను.. అన్నీ వీడియోలో రికార్డ్ చేస్తుంటానని..కానీ వాటిని ఎప్పుడూ పబ్లిష్ చేయలేదని చెప్పింది అనన్య. ఇప్పటికీ ఆ వీడియోస్ తన దగ్గర ఉన్నాయని అంది. అయితే ఆ వీడియోలను లీక్ చేస్తా అంటూ.. ఆర్యన్ తనని బెదిరించేవాడని చెప్పింది. తాను చెప్పిన పని చేయకపోతే మా వీడియోస్ బ్లాక్ మెయిల్ చేసేవాడని.. చిన్నప్పటి విషయాలను పంచుకుంది.

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్. ప్రస్తుతం దుస్తుల వ్యాపారంలో బిజీగా ఉన్న ఆర్యన్.. బిజినెస్ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. త్వరలోనే తన చిత్రంతో అడియన్స్ ముందుకు రానున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.