Dhanush: అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్ సీరియస్.!
కోలీవుడ్ హీరో ధనుష్‌కు పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియులకు దగ్గర్యయాడు ధనుష్. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్న ఈ హీరో.. ఓ వీడియో కారణంగా ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబైలోని జుహు బీచ్‌లో ప్రస్తుతం కుబేర షూటింగ్‌కి ధనుష్ హాజరయ్యారు.
కోలీవుడ్ హీరో ధనుష్‌కు పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియులకు దగ్గర్యయాడు ధనుష్. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్న ఈ హీరో.. ఓ వీడియో కారణంగా ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబైలోని జుహు బీచ్‌లో ప్రస్తుతం కుబేర షూటింగ్‌కి ధనుష్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ధనుష్ బీచ్‌లో నడుచుకుంటూ వెళుతుండగా ఓ అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ధనుష్ బాడీగార్డ్ ఆ వ్యక్తిని పట్టుకుని తోసేశాడు. అక్కడున్న మరికొంత మంది అభిమానులను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ధనుష్ ప్రవర్తనపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్నటి మొన్న నాగార్జున బాడీగార్డ్ కూడా ఓ విషయంలో ఇలాగే అనుచితంగా ప్రవర్తించాడు. నాగ్ ను కలిసేందుకు ప్రయత్నించిన అతడిని.. పక్కకు లాగి పడేశాడు. ఆ వీడియోతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఇక ఇప్పుడు ధనుష్ కూడా.. తన బాడీగార్డ్ తీరుతో విమర్శల పాలవుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.